BigTV English

Gold price today: షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..ఈసారి ఏకంగా!

Gold price today: షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..ఈసారి ఏకంగా!

Gold Rates increased today: బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్. గురువారం బులియన్ మార్కెట్‌లో ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం విషయంలో ఒక్క గ్రాముపై రూ.71 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.73,260కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారంపై ఒక్క గ్రాముకు రూ.65 పెంచడంతో 10గ్రాముల ధర రూ.67,160కు చేరుకుంది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిద్దాం.


చెన్నైలో బంగారం 22 క్యారెట్ల ధర రూ.67,160 ఉండగా..24 క్యారెట్ల ధర రూ.73,260గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,310 ఉండగా..24 క్యారెట్ల బంగారం ధర రూ.73,410కి ఎగిసింది. ఇక, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,160 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,260 కి పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,160 ఉండగా..24 క్యారెట్ల ధర రూ.73,260 పలుకుతుంది.


వెండి ధరలు మాత్రమ స్వల్పంగా తగ్గింది. దాదాపు కిలో వెండికి రూ.100వరకు పతనమైంది. ఢిల్లీలో కిలో వెండి రూ.88,400 పలుకుతుండగా..హైదరాబాద్‌లో మాత్రం కిలో వెండి రూ.93,400 వరకు పెరిగింది. ఈ ధరలు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధరలు మారుతూ వస్తుంటాయి.

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపై బంగారం ధరలు ఆధారపడి ఉంటయి. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా ధరలు పెరిగిన లేదా తగ్గినా ఆ ప్రభావం భారత్ మార్కెట్లపై కూడా ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ వ్యాంకుల నిర్ణయాలు వడ్డీరేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు మారుతుంటాయి.

Also Read:  బీజేపీకి షాక్ ఇచ్చిన హర్యానా ఎన్నికల సంఘం..

ఇదిలా ఉండగా, మల్టీ కమొడిటీ ఎక్స్చేంజీలో బుధవారం బంగారం ధరలు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీనతల కారణంగా బులియన్ ధరలు పడిపోవడంతోనే ధరలు పడిపోయాయి. ఇదే సమయంలో యూఎస్ డాలర్ పెరగడంతో సిల్వర్ ధరలు కూడా తగ్గాయి. అంటే డాలర్ విలువ పెరిగితే బంగారం ధర తగ్గుతుందని కొందరు భావిస్తుంటారు.

Related News

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Jio Prepaid Plans: వామ్మో .. ఏమిటి, జియో ఇన్ని రిచార్జ్ ప్లాన్స్ తొలగించిందా?

Foreclosing Loan: బ్యాంక్ లోన్ ఫోర్ క్లోజ్ చేయడం మంచిదా? కాదా? మన క్రెడిట్ స్కోర్ పై దీని ప్రభావం ఉంటుందా?

Jio Recharge Offers: జియో బంపర్ ఆఫర్.. రీచార్జ్ చేసుకుంటే వెంటనే క్యాష్‌బ్యాక్!

Big Stories

×