Gold Rates: గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు నాన్‌స్టాప్‌గా పరుగులు పెడుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి.. వారం రోజుల క్రితం బంగారం ధరలు భారీగా తగ్గాయి అనుకునేలోపే.. మళ్లీ పెరుగుతు వస్తుంది. గురువారం రోజు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 93,380 ఉండగా.. శుక్రవారం 24 క్యారెట్ల రూ. 95,400 కు చెరింది. గురువారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.85,600 ఉండగా.. శుక్రవారం నాటికి 87,450 కు చెరింది. బంగారం ధర ఇలా పెరుగుతూ పోతుంటే ప్రజలు బంగారం రేపటి రోజుల్లో అంత పెట్టి కొనగలరా అని ప్రశ్నిస్తున్నారు.
పగబట్టిన పసిడి..
పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. రోజు ఇలా పెరుగుతూ పోతుంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు.. బుధవారం నుంచి గురువారంకు రూ.3000 పెరగగా.. గురువారం నుంచి శుక్రవారంకు రూ.2000 పెరిగింది అంటే రెండు రోజుల్లోనే రూ.5000 పెరిగింది.. బంగారం ఇలా పెరిగితే సామాన్య ప్రజులు ఎలా కొనగలుగుతారు అని ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం తగ్గిందని అనుకునే లోపే ప్రజలుకు ఊహిచంని దెబ్బ కొట్టింది.
ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధర తగ్గుతూ వచ్చింది. పసిడి ప్రియులు బంగారం తగ్గింది అని సంతోషించే లోపే వారికి నమ్మకంపై ఆశలు పోయాయి. ఇంకా బంగారం కొనాలంటే సామాన్య ప్రజలు వారికున్న ఆస్తులు అమ్మకోవాల్సిందే.. ఇలా లక్షకు చేరువలో ఉన్న బంగారం ధర ఇంకా రెండు రోజుల్లో లక్షకు పెరగవచ్చు అంటున్నారు.
లక్షకు చెరువులో..
నిన్న, మెన్నటి వరకు తగ్గిన బంగారం ధర గత మూడు రోజులుగా మళ్లీ పెరుగుతూ వస్తుంది. ట్రంప్ చేసే పనుల వల్ల అంతర్జాతీయ మార్కెట్ ఏ క్షణంలో ఏ రేటు ఉంటుందో అని భయపడుతున్నారు. పసిడి ప్రియలు బంగారం కొనాలంటే.. అమ్మో లక్ష అని బయపడుతున్నారు. ఎంతో ఇష్టంగా కొనాలి అని ఉన్నవారు కూడా బంగారం పై మెుగ్గు చూపడం తగ్గిస్తారు. బంగారం రేటు రేపటి రోజుల్లో కూడా ఇలాగే ఉంటుందా? లేకుంటే ఏమన్నా తగ్గుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.