Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సింగపూర్ లో మార్క్ స్కూల్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల అతనికి గాయాలు అయ్యాయి.. ప్రమాదం పై వెంటనే స్పందించిన యాజమాన్యం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మార్క్ ఆరోగ్యం బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ కుమారుడు ప్రమాదానికి గురయ్యాడని అందరు బాధపడ్డారు.. బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అయితే అల్లు అర్జున్ అభిమాని ఒకరు అసభ్య పదజాలంతో RIP అని ట్వీట్ చేశారు. అతని ట్వీట్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. అలాంటివారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. తాజాగా అతనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఆ కేసు గురించి పూర్తి వివరాలను ఒకసారి తెలుసుకుందాం..
అల్లు అర్జున్ ఆర్మీకి షాక్.. జైలుకు అభిమాని..
పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు జరిగిన ప్రమాదం గురించి తెలిసి తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.. ఆ బాబుకి ఎటువంటి ప్రమాదం జరగకూడదని దేవుడిని వేడుకున్నారు. మనిషన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రమాదంపై రెస్పాండ్ అయ్యి బాబు ఆరోగ్యంగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా పోస్ట్లు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో అగ్గి కి ఆజ్యం పోసినట్లు అల్లు అర్జున్ ఆర్మీ అభిమాని ఒకరు అతను చనిపోవాలని కోరుకుంటూ బూతులతో ట్వీట్ చేశాడు.. ఆ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలను అటు రాజకీయాల్లోనూ దుమారం రేపింది. దానిపై స్పందించిన పవన్ అభిమానులు వెంటనే అతని అదుపులోకి తీసుకొని కఠిన శిక్షలు వేయాలని అధికారులను కోరారు.
Also Read :‘జబర్దస్త్’ షోలో పాలిటిక్స్? ఆ నటుడిని అంత ఘోరంగా మోసం చేశారా?
బిగ్ టీవీ రాసిన ఆర్టికల్ ఫై స్పందన..
బిగ్ టీవీలో రాసిన కథనం ప్రకారం.. పోలీసులు వెంటనే స్పందించి అతని పై కేసు నమోదు చేశారు. త్వరలోనే అతన్ని అదుపులోకి తీసుకొని వివరణ కోరనున్నారని సమాచారం.. దీనిపై పోలీసులు వెంటనే స్పందించడంతో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పై, బిగ్ టీవీ పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు..
అల్లు అర్జున్ మౌనం వీడరా..?
సినీ హీరో అల్లు అర్జున్ తన అభిమానులను ఆర్మీ అంటూ చాలా గొప్పగా చెప్పుకుంటాడు. కేవలం సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఆర్మీ కావాలా? తన అభిమానులు తప్పు చేస్తే సరిదిద్దె బాధ్యత అల్లు అర్జున్ కి లేదా? ఒక పసి పిల్లాడికి ప్రమాదం జరిగితే, దాని ఫై స్పందించి అయ్యో పాపం అనకుండా చనిపోవాలని కోరుకుంటూ రాయలేని పదాలతో అభిమాని పెట్టిన పోస్ట్ ఫై ఇప్పటికీ అల్లు అర్జున్ ఎందుకు స్పందించలేదు? ఇలాంటి ప్రశ్నలు అల్లు అర్జున్ అభిమానుల్లో సైతం వినిపిస్తున్నాయి. మెగా కుటుంబంలో ఒకడిగా పెరిగిన అల్లు అర్జున్ ఇప్పుడు ఆ కుటుంబానికి దూరంగా ఉంటే ఇలాంటి వాటికి కూడా స్పందించకుండా ఉండటం తప్పు అని ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. ఫ్యామిలీ గొడవలు పక్కన పెడితే ఒక మనిషిగా ఇలాంటివి జరిగినప్పుడు స్పందిస్తే బాగుంటుందని అల్లు అర్జున్ కి కొందరు అభిమానులు సలహాలు ఇస్తున్నారు. మరి ఇప్పటికైనా అల్లు అర్జున్ స్పందించి ఈ విషయంపై సీరియస్ అవుతారేమో చూడాలి..