Suniel Shetty Review on Kantara: కాంతార: చాప్టర్ 1 ప్రస్తుతం బాక్సాఫీసు దుమ్మురేపుతుంది. రోజురోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అప్పుడే రూ. 500 కోట్ల క్లబ్లో చేరింది. విడుదలైన అన్ని భాషల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. నార్త్ నుంచి సౌత్ వరకు అన్ని వర్గాల ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక కాంతార చిత్రంపై సినీ సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా చూసి సోషల్ మీడియాలో తమ రివ్యూ ఇస్తున్నారు. సౌత్లోనే కాదు బాలీవుడ్ సినీ సెలబ్రిటీలను సైతం కాంతార: చాప్టర్ 1 బాగా ఆకట్టుకుంటుంది.
ఇప్పటికే ఈ చిత్రంపై టిమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రశంసలు కురిపించాడు. మూవీ అద్భుతం అంటూ రిషబ్ శెట్టికి కితాబిచ్చాడు. తాజాగా ఆయన మామ, సీనియర్ బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా కాంతార: చాప్టర్ 1 సినిమా చూశారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా రివ్యూ ఇచ్చారు. “నిన్న రాత్రి కాంతార:చాప్టర్ 1 చూశాను. ఈ సినిమా నన్నేంతగానో కదిలించింది. నన్ను కదిలించడమే కాదు ఈ సినిమా నా నరనరాల్లోకి వెళ్లింది. సినిమా చూస్తున్నంత సేపు గూస్బంప్స్, కన్నీళ్లు, గర్వం, శాంతి.. అన్ని భావోద్వేగాలు ఒకేసారి వచ్చాయి. ఇలాంటి ఫీలింగ్ని నిజమైన సినిమా మాత్రమే ఇవ్వగలదు అని నా నమ్మకం. ఆ సినిమా మన మూలాలను అనుభూతి చెందేలా చేస్తుంది. నిజమైన భారతీయ సినిమా ఇది. మన నేల, మన ప్రజలు, మన దేవుళ్లను చూపించినప్పుడు అది దైవికంగా మారుతుంది.
ఇలాంటి కథలను మనం ఆదరించడం, ఇలాంటి నిజమైన కథలనే ఎంచుకున్నంత కాలం.. చెడ్డ సినిమా అంటూ ఉండదు. అలాంటి సినిమాను అందించిన రిషబ్ శెట్టి, కాంతార టీంకి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మన మాలాలను గౌరవిస్తూ వాటిలో నిమగ్నమైన వ్యక్తి మాత్రమే ఇలాంటి శక్తివంతమైన సినిమాని సృష్టించగలడు. కాంతార: చాప్టర్ 1 ఎల్లప్పటికీ నాతో, నాలోనే ఉంటుంది” అంటూ సునీల్ శెట్టి భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే ఈ మూవీ దర్శక–నటుడు, నిర్మాణ సంస్థ హొంబలే ఫిలింస్ని తన ట్వీట్కి ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం సునీల్ శెట్టి ట్వీట్ ఫ్యాన్స్ని ఆకట్టుకుంది. కాగా రిషబ్ శెట్టి బాలీవుడ్ నటుడు అయినప్పటికీ అతడు బెంగళూరుకి చెందివాడు అనే విషయం తెలిసిందే. ఆయన కర్ణాటక మంగళూరులో జన్మించారు.
అందుకు కాంతార మూవీ ఆయనను అంతగా ఆకట్టుకుందని, స్థలం, భాష మారిన.. సునీల్ శెట్టిన తన మూలలను మరిచిపోలేదంటూ నెటిజన్స్ ఆయన ట్వీట్పై కామెంట్స్ చేస్తున్నారు. కాగా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2021లో వచ్చి కాంతార: చాప్టర్ 1కి ప్రీక్వెల్గా వచ్చింది. ఎలాంటి అచనాలు లేకుండ వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకుంది. కేవలం రూ. 16 కోట్ల రూపొందిన కాంతార మూవీ వరల్డ్ వైడ్ రూ. 400 పైగా కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. దీనికి ప్రీక్వెల్గా కాంతార: చాప్టర్ 1ని తెరకెక్కించాడు రిషబ్ శెట్టి. రూ. 120 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా విడుదలైన మొదటి వీక్లోనే రూ. 509 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొదటి రోజే ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. మూడు రోజుల్లోనే రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇక తొలి వారంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమా కాంతార: చాప్టర్ 1 కన్నడ బాక్సాఫీసు వద్ద రికార్డు నెలకొల్పింది.
Last night, Kantara didn’t just move me — it went straight through my veins.
Goosebumps, tears, pride, peace… all at once.I guess – that’s what real cinema does — it makes you feel your roots.
This is what Indian cinema is truly about — when it speaks of our soil, our people,… pic.twitter.com/RkzQOTmT6V— Suniel Shetty (@SunielVShetty) October 10, 2025