Funky Teaser : అనుదీప్ కేవీ దర్శకత్వంలో విశ్వక్సేన్ నటించిన సినిమా ఫంకి. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ప్రిన్స్ సినిమా తర్వాత అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అనుదీప్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి రాబోయే టీజర్ లో ఎటువంటి జోకులు యాడ్ చేశాడు అని అందరూ చాలా క్యూరియాసిటీతో ఎదురు చూశారు. అయితే వాళ్లందరి ఎదురుచూపులకి తెరపడిపోయింది.
ఈ టీజర్ ప్యూర్ అనుదీప్ స్టైల్లో ఉంది. విశ్వక్సేన్ ఈ సినిమాలో దర్శకుడుగా నటిస్తున్నాడు. రియల్ లైఫ్ లో కూడా విశ్వక్సేన్ దర్శకుడు కావడం విశేషం. టీజర్ ఓపెన్ చేయగానే తన అసలైన పంచుతో కం బ్యాక్ ఇచ్చాడు అనుదీప్ అనిపించింది. “చిన్నప్పుడు అమ్మ చెప్పింది వినలేదు రా మనం, అనగానే ఏం చెప్పారండి అని వేరే వాళ్ళు అడగడం” చెప్పాను కదండీ వినలేదు అని.
అలానే విశ్వక్సేన్ స్పీచ్ ఇస్తూ ఈ స్కూల్ ఎంత గొప్ప స్కూలు మీకు అర్థమవుతుందా.? ఈ స్కూల్ ఇంత గొప్ప స్కూల్ కాబట్టే నేను ఇక్కడ చదువుకున్న కూడా చదువు మీద ఇంట్రెస్ట్ లేక డైరెక్టర్ అయిన అంటూ విశ్వక్సేన్ చెప్పడం. మరో పంచ్.
టీజర్ మొత్తంలో ఇలాంటివి పవర్ ప్యాకెడ్ గా అనుదీప్ ప్లాన్ చేశాడు. ఈసారి జాతి రత్నాలను మించి మరో హిట్ కొట్టబోతున్నాడు అని కూడా చెప్పొచ్చు. చాలా అద్భుతంగా ఈ కథను డిజైన్ చేసుకున్నట్లు అర్థమవుతుంది.
ఎప్పటిలాగానే అనుదీప్ తన టీజర్ తో అందరిని నవ్వించాడు. టీజర్ చూసిన తర్వాత సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి. ముఖ్యంగా విశ్వక్ ఇప్పటివరకు ఇటువంటి క్యారెక్టర్ లో కనిపించలేదు. అనుదీప్ రైటింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నిజాన్ని కూడా చాలా కామెడీగా రాయడం అనుదీప్ రైటింగ్ లో ఉన్న స్టైల్. ఆ టైమింగ్ పట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇటువంటి అసభ్యకరమైన పదజాలానికి తావివ్వకుండా, డబుల్ మీనింగ్ డైలాగులు వాడకుండా ఇలా రాయడం అన్నది ఒక సెపరేట్ స్కిల్.
జాతి రత్నాలు సినిమా నుంచి ఇది మనం గమనించవచ్చు. కేవలం జాతి రత్నాలు సినిమా మాత్రమే కాకుండా ప్రిన్స్ సినిమాలో కూడా ఇటువంటి డైలాగులే ఉంటాయి. ఉదాహరణకు ఈయన మా నాన్నగారు వయసులో నాకంటే పెద్దవారు అని రాస్తాడు అనుదీప్. అది థియేటర్లో చూసినప్పుడు ప్రతి ఒక్కరికి నవ్వొస్తుంది. అని దాని గురించి ఆలోచిస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఈ టీజర్ విషయానికి వస్తే విశ్వక్ కామెడీ టైమింగ్ కూడా అదిరిపోయింది.