BigTV English

Shivaji: వామ్మో శివాజీ ఇన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారా… అన్ని సూపర్ హిట్టే!

Shivaji: వామ్మో శివాజీ ఇన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారా… అన్ని సూపర్ హిట్టే!

Actor Shivaji: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న శివాజీ(Shivaji) ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన కెరియర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించారు. అనంతరం హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇకపోతే శివాజీ తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. ఇటీవల నాని నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోర్టు సినిమాలో మంగపతి పాత్రలో ఈయన అద్భుతమైన నటనను కనబరచడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి మరొక విలన్ దొరికారు అంటూ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.


సూపర్ హిట్ సినిమాలకు డబ్బింగ్ చెప్పిన శివాజీ..

ఇలా కెరియర్ పరంగా సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో బిజీగా గడుపుతున్న శివాజీ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారనే విషయం బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు తేజ(Teja) ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మొదటి సినిమా చిత్రం (Chitram). ఈ సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ పేరు ఇండస్ట్రీలో బాగా వినిపించింది. ఇక ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కు శివాజీ డబ్బింగ్ చెప్పారని తెలుస్తోంది. అదేవిధంగా తేజ డైరెక్షన్ లో నితిన్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతూ నటించిన చిత్రం జయం(Jayam).

మేము అడిగితేనే చెప్పారు…

ఈ రెండు సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో అందరికీ తెలిసిందే. అయితే నితిన్ పాత్రకు కూడా శివాజీ డబ్బింగ్ చెప్పటం విశేషం. ఇలా ఈ సినిమాలలో శివాజీ డబ్బింగ్ చెప్పారని, మేమే ఆయనని వేడుకున్నామని, అందుకే మా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు అంటూ తేజ తెలియజేశారు. ఇలా ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ కావడంతో అనంతరం నితిన్ హీరోగా నటించిన దిల్ సినిమాకు, నందమూరి తారకరత్న హీరోగా నటించిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాకి కూడా శివాజీ డబ్బింగ్ చెప్పటం విశేషం. ఇలా శివాజీ డబ్బింగ్ చెప్పిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి.


బజ్ హోస్ట్ గా శివాజీ…

ఇక ఈ విషయం తెలిసిన శివాజీ అభిమానులు శివాజీ మల్టీ టాలెంటెడ్ నటుడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక కోర్టు సినిమాలో ఈయన విలన్ గా తన నటనతో అదరగొట్టిన నేపథ్యంలో తదుపరి సినిమాలలో కూడా విలన్ గానే అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న శివాజీ ఒక్కసారిగా అవకాశాలు లేకుండా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా సందడి చేసిన ఈయన విన్నర్ గా బయటకు వస్తారని అభిమానులు భావించారు కానీ టాప్ 3 కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా బిగ్ బాస్ అనంతరం శివాజీ కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఈయన బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Also Read: Shivaji: వామ్మో శివాజీ ఇన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారా… అన్ని సూపర్ హిట్టే!

Related News

Manchu Lakshmi: బాడీ షేమింగ్‌ కామెంట్స్‌.. మంచు లక్ష్మికి సీనియర్‌ జర్నలిస్ట్‌ క్షమాపణలు

Deepika Padukone: దీపికా పదుకొనెకు కేంద్రం అరుదైన గౌరవం.. దేశంలోనే మొదటి వ్యక్తిగా గుర్తింపు!

Kiran Abbavaram: మైత్రి రవి, ప్రదీప్ రంగనాథన్ ఇష్యూపై స్పందించిన కిరణ్ అబ్బవరం

Skn The Raja Saab : ప్రభాస్ రాజా సాబ్ సెట్స్ లో ఏడ్చిన ఎస్ కే ఎన్, అసలు ఏం జరిగింది?

Rajamouli: రాజమౌళికి ‘ జక్కన్న’ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా? ఇంత స్టోరీ ఉందా?

Kiran Abbavaram : సింపతి అంటే నచ్చదు.. బాధ పెట్టొద్దు అంటూ

Kantara Chapter1 collections : మరి హీనంగా హిట్ అయిన సినిమాకి కూడానా? ప్రేక్షకులు పిచ్చోళ్ళ?

Megastar Chiranjeevi : మాటలు మాత్రమే చెప్పారు, ప్రాజెక్టులు పక్కన పడేసారు

Big Stories

×