Today Gold Rate: బంగారం ధరలు ఒకరోజు తగ్గుతూ.. ఒకరోజు.. పెరుగుతున్నాయి. కానీ, గత వారం రోజులుగా బంగారం ధరలలో ఊహించని మార్పు వచ్చింది. అతి భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు కొంచెం కొంచెం దిగుతుంది. అయితే శుక్రవారం భారీగా పెరిగిన బంగారం ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. తులం ఎంత ఉందంటే..!
నేటి బంగారం ధరలు..
అయితే శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,280 కాగా.. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,000 వద్ద ఉంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,13,000 ఉండగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,750 వద్ద పలుకుతోంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.280 తగ్గింది..
బంగారం ధరలు తగ్గడానికి కారణం..
భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం పెట్టుకునేది ఒక భారతీయులు మాత్రమే.. అలాంటి పసిడి ప్రియులు ధరలు పెరగడంతో చాలా ఆందోళన చేందారు. అయితే నిన్నమొన్నటి వరకు అంతలా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుతున్నాయి. ఎందుకంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సౌత్ కొరియాలో చైనా ప్రెసిడెంట్ షి జెన్ పింగ్ తో సమావేశం అవుతారన్నప్పటి నుంచి బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. అయితే ఇదే సమయంలో గరిష్టాల దగ్గర ప్రాఫిట్ బుకింగ్‌తో వరుసగా 10 రోజులకుపైగా పసిడి ధరలు దిగొచ్చాయి. ఈ క్రమంలోనే తులంపై సుమారు రూ. 10 వేలకుపైనే తగ్గింది.
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,23,000 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,750 వద్ద ఉంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,000 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,750 వద్ద పలుకుతోంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,000 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,750 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,150 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,12,900 వద్ద ఉంది.
Also Read: గీత దాటితే సస్పెండ్..!! తిరువూరు పంచాయితీ పై చంద్రబాబు సీరియస్
నేటి సిల్వర్ ధరలు..
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. వెండి ధరలు 10 రోజులలో రూ.35000 వరకు తగ్గింది. రికార్డులోనే ఇంతల మొదటి సారి తగ్గింది. అయితే సిల్వర్ ధరలు నేడు అనగా శనివారం స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,65,000 కాగా.. నేడు శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 1,66,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ పై రూ.1,000 పెరిగింది.. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,52,000 వద్ద కొనసాగుతోంది.