Today Gold Rate: పసిడి ప్రియులకు మరోసారి శుభవార్త.. గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ.. పెరుగుతూ ఉన్నాయి. అయితే రెండు రోజుల నుంచి బంగారం 5 వేలు తగ్గింది. ఇవాళ హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 2130 రూపాయలు దిగొచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1950 రూపాయలు తగ్గింది. ఇవాళ హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం 93వేల 930 పలుకుతోంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర 86వేల 100 రూపాయలుగా ఉంది. ఇటీవల బంగారం ధర లక్ష రూపాయలు మార్క్‌ను దాటింది. ఇవాల్టి ధరతో పోలిస్తే.. గరిష్ట స్థాయి నుంచి 6 వేల రూపాయల ఫైనే తగ్గింది.
అమెరికా, చైనా ట్రెడ్ వార్‌కు పాటు.. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇటీవలి కాలంలో బంగారం ధరలు దూసుకెళ్లాయి. పెట్టుబడులకు బంగారమే సేఫ్ అన్నట్లుగా మారిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా బంగారంకు డిమాండ్ పెరిగిపోయింది. అందుకే చరిత్రలో ఎన్నడు లేని విధంగా 24 క్యారెట్ల తులం స్వచ్ఛమైన బంగారం ధర లక్ష దాటిపోయింది. ఇప్పుడు అమెరిక-చైనా మధ్య టారిఫ్ వార్‌కు తెరపడటం, ఇండియా-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరపడంతో బంగారం మీద పెట్టుబడులు పెట్టడంతో ప్రాఫిట్ బుకింగ్‌కి దిగారు. ఒక్క సారిగా గోల్డ్‌కి డిమాండ్ పడిపోవడంతో ధరలు దిగివస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
అయితే దేశీయా స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ మదుపర్లు అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 387 పాయింట్ల లాభంతో 81,517 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 118 పాయింట్ల లాభంతో 24,696 వద్ద ఉన్నాయి.
ఇదిలా ఉంటే బంగారం ధరలు భవిష్యత్తులో ఇంకా తగ్గుతాయి లేక పెరుగుతాయా అనే సందేహం పసిడి ప్రియులలో కలుగుతుంది. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తునట్లు నిజాంగానే బంగారం రూ.50,000 అవుతుందా.. లేదా లక్ష దాటుతుందా అనే ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి బంగారం తగ్గుతుంది. ఎవరైన కొనాలి అనుకుంటే తొందరగా కొనడం మంచి ఆలోచన.. లేదంటే మళ్లి పెరిగితే ఏమి చేయలేని పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. సో డబ్బులు ఉంటే తొందరగా బంగారం కొనండి.