Andhra King Taluka :యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) తాజాగా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈరోజు రామ్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుండి టైటిల్ రిలీజ్ చేయడమే కాకుండా గ్లింప్స్ కూడా విడుదల చేశారు మేకర్స్. అయితే తాజాగా రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ మాత్రం వ్యతిరేకతను కలిగిస్తోందనే మాటలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. ఇందులో సూపర్ హీరోగా కర్ణాటక స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) మెయిన్ హీరోగా నటిస్తూ ఉండగా.. మరో హీరోగా ఉపేంద్ర అభిమానిగా రామ్ (Ram ) నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే (Bhagya Sri borse) హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. ఈ సినిమాను మహేష్ బాబు.పి (Mahesh Babu.P) దర్శకత్వం వహిస్తున్నారు.
రిస్కీ టైటిల్ తో రామ్..
లవ్ స్టోరీ, ఫ్యాన్ బేస్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు రామ్ ఒకవేళ తేడా వస్తే మాత్రం రామ్ కి వాచిపోద్ది అనే రేంజ్ లో నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా తేడా కొట్టింది అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఊరుకుంటారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు ఉపేంద్ర క్యారెక్టర్ ను బ్యాడ్ చేసినట్లు చూపించినా సరే రామ్ కి వాచిపోద్ది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే రిస్కీ టైటిల్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచాక.. ఆయన అభిమానులు, పిఠాపురం ప్రజలు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేవాళ్ళు. అటు బైక్స్ , కార్ల పైన కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాయించుకోవడంతో ఆ పేరు చాలా వైరల్ అయింది. ఇప్పుడు దానిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలామంది తాలుకా అని కూడా రాసుకుంటున్నారు. అందులో భాగంగానే పిఠాపురం తాలూకా ఇన్స్పిరేషన్ తీసుకొని ఆంధ్ర కింగ్ తాలూకా అని రామ్ టైటిల్ పెట్టినట్లు అనిపిస్తోంది.ఈ క్రమంలోనే టైటిల్ కి మంచి రీచ్ వచ్చినా.. ఒకవేళ తేడా కొడితే మాత్రం నిజంగా ఆ పరిణామాలను రామ్ ఫేస్ చేయాల్సి ఉంటుందని నెటిజన్స్ ముందుగానే వార్న్ చేస్తున్నారు. మరి రిస్కీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు రామ్.. సినిమాతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.
ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా విశేషాలు..
ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా విషయానికి వస్తే.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న మహేష్ బాబు.పి ఈ చిత్రానికి దర్శకుడిగా పని చేస్తూ ఉండగా.. బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని(Naveen Yerneni), వై.రవిశంకర్ (Y. Ravishankar ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య గేమ్స్ రిలీజ్ చేశారు. కానీ మొదటితోనే అనుమానాలు రేకెత్తిస్తోంది. మరి భాగ్యశ్రీ, రామ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
also read:Naa Anveshana : పెద్ద తప్పు చేశాడు… అన్వేషణ పేరు తీయగానే ఊగిపోయిన శివ బాలాజీ