Gold Rate: అరే ఏంట్రా బంగారం ధరలు ఇలా పెరిగిపోతున్నాయి. బంగారం కొనాలంటేనే ప్రజలు బయపడిపోతున్నారు. కొన్ని రోజులు అయితే తగ్గుతది అనుకుంటే.. అసలు తగ్గడం కాదు కదా.. భారీగా దూసుకెళుతుంది. రోజూ బంగారం ధరలు ఇలా పెరుగుతూ పోతే.. ఇంకా పసిడి ప్రియులకు అందకారమే.. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,05,880 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.97,050 పలుకుతోంది. సోమవారం రోజూ 10 గ్రాముల బంగారం పై రూ. 930 పెరిగింది.
భగ్గుమంటున్న బంగారం ధరలు..
బంగారం ధరలు ఇలా పెరుగుతు ఉంటే.. పసిడి ప్రియలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత 10 రోజులుగా బంగారం ధరలు తగ్గేదేలే అంటూ పరుగులు పెడుతుంది. ఇంతలా బంగారం ధరలు పెరుగుతుంటే.. బంగారం షాపుల్లో రద్దీ మాత్రం తగ్గడం లేదు.. అంతేకాకుండా పండుగల వేళ, వచ్చే నెలలో మళ్లీ పెళ్లిళ్లు రావడంతో.. బంగారం పెరిగిన కొనడం మాత్రం ఆపడం లేదు. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఉన్న బంగారం ధరలకు బంగారం కొనాలంటే వారి ఆస్తులు తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి.. అంటే అంతలా బంగారం ధరలు పెరుగుతున్నాయి. కానీ, ఎందుకు ఈ బంగారం ధరలు ఇలా పెరుగుతున్నాయని ప్రతి ఒక్కరి మదిలో మెలుగుతున్న ప్రశ్న?
బంగారం కంటే భూమి కొనడం బెటర్..
ఒకప్పుడు భూమి కొనడం కన్నా బంగారం కొనడం బెటర్ అని చాలా మంది బంగారం కొనేవారు.. కానీ ఇప్పుడున్న ధరలకు బంగారం కన్నా భూమి కొనడం మంచిదని చాలా మంది ప్రజలు ఆలోచనలు..
బంగారం పెరగడానికి అసలు కారణాలివేనా?
ప్రస్తుతం ట్రంప్ టారిఫ్‌లు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్నాయి. ట్రంప్ భారత్ సహా పలు దేశాలపై పెద్ద మొత్తంలో దిగుమతి సుంకాల్పి విధించారు. అంతేకాకుండా మన దేశం పై అదనంగా 50 శాతం సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారన్న కారణంతో అదనంగా సుంకాలు విధించినట్లు ప్రకటించారు. దీంతో బంగారం రేట్లు మళ్లీ భారీగా పుంజుకున్నాయి.
సోమవారం రాష్ట్రంలో బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో సోమవారం 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,05,880 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,050 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
అలాగే వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,05,880 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,050 వద్ద పలుకుతోంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,05,880 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,050 వద్ద ఉంది.
ముంభైలో నేటి బంగారం ధరలు..
ముంభైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,05,880 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,050 కొనసాగుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,030 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.97,200 వద్ద పలుకుతోంది.
Also Read: వినాయక నిమజ్జనంలో ఎన్టీఆర్ ఫ్లెక్సీల వివాదం.. పగిలిన తలలు
నేటి సిల్వర్ ధరలు ఇలా..
బంగారం ధరలు పెరుగుతే నేనెందుకు పెరగకూడదు.. అన్నట్టుగా సిల్వర్ ధరలు కూడా దూసుకెళుతున్నాయి. సోమవారం కేజి సిల్వర్ ధర రూ. 1,36,900 వద్ద పలుకుతోంది. ఒక్కరోజే సిల్వర్ ధరలు కేజిపై రూ.1000 పెరిగింది. అలాగే కలకత్త, ముంభై, ఢీల్లిలో కేజీ సిల్వర్ ధరలు రూ. 1,26,000 వద్ద కొనసాగుతోంది.