BigTV English

KTR Angry: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగింతపై కేటీఆర్ ఫైర్, న్యాయస్థానంలో హరీష్‌రావు పిటిషన్

KTR Angry: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగింతపై కేటీఆర్ ఫైర్, న్యాయస్థానంలో హరీష్‌రావు పిటిషన్

KTR Angry: తెలంగాణలోకి సీబీఐ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? ఈ రాష్ట్రం నుంచి సీబీఐకి రెండు కేసులు వెళ్లాయా? రేపో మాపో సీబీఐ దిగనుందా? దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసిందా? తెలంగాణ సీఎంపై కేటీఆర్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? బీఆర్ఎస్‌లో ఉక్కుపోత మొదలైందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంతేకాదు ఈ కేసు సీబీఐకి అప్పగించిన తెలంగాణ సీఎంపై భగ్గుమన్నారు. సీబీఐ అంటే బీజేపీ ప్రతిపక్షాల నిర్మూలన సెల్ అన్న రాహుల్ గాంధీని ఆయన ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా? అంటూ రాసుకొచ్చారు. తమపై ఎలాంటి కుట్రలకు పాల్పడినా వాటిని న్యాయపరంగా, రాజకీయంగా పోరాడతామన్నారు. న్యాయవ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాత బీఆర్ఎస్ నుంచి వచ్చిన మొదటి రియాక్షన్.


మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై హైకోర్టులో హరీశ్‌రావు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసర పిటిషన్ కింద విచారణ చేపట్టాలని కోరారు. సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని కోర్టుకు హరీశ్‌రావు న్యాయవాది వివరించారు.

ALSO READ: కాళేశ్వరం సీబీఐ చేతికి.. తొలిసారి కేంద్రమంత్రి రియాక్ట్

అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఏజీ కోర్టుకు తెలిపారన్నారు హరీశ్ న్యాయవాది.  అసెంబ్లీలో తీర్మానం చేయకుండానే సీబీఐకి అప్పగించారని పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణ మంగళవారం నాటికి వాయిదా వేసింది. అప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరారు హరీశ్ న్యాయవాది. అందుకు నిరాకరించింది న్యాయస్థానం.

ప్రభుత్వం చర్యలు చూస్తుంటే ఈ రోజు నివేదికపై చర్యలు తీసుకునేటట్లు కనిపిస్తోందన్నారు. విచారణ సందర్భంగా ప్రభుత్వం నిన్ననే ఉత్తర్వులు జారీ చేశామని చెప్పే అవకాశం ఉందన్నారు. రేపటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని సీజేను పదే పదే కోరారు హరీశ్ తరపు లాయర్.

దీనిపై ప్రభుత్వం నిర్ణయమేంటో తెలుసుకొని చెప్పాలని జేపీ ఆదేశించింది సీజే ధర్మాసనం. రేపు లేదా ఎల్లుండి చెప్తామని న్యాయస్థానానికి తెలిపారు. రేపటిలోగా ప్రభుత్వం నిర్ణయాన్ని చెప్పాలని ఆదేశించిన న్యాయస్థానం, తదుపరి విచారణ వాయిదా వేసింది.

తెలంగాణ నుంచి మరో కేసు సీబీఐ చేతికి వెళ్లింది. న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసు దర్యాప్తు ఇటీవల సీబీఐకి అప్పగించింది సుప్రీంకోర్టు. దీనిపై ఆగష్టు 13న ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ వామన్‌రావు తండ్రి కిషన్‌రావు పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఓపీనియర్ తీసుకున్న తర్వాత  న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. దీంతో తెలంగాణ నుంచి సీబీఐకి రెండు కేసులు వెళ్లాయి.

తెలంగాణలో సీబీఐ ఎంటర్ కావడానికి వీళ్లేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే గత ప్రభుత్వం జారీ చేసిన జీవోని సవరించి మరొక జీవో‌ను విడుదల చేయనుంది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీకి స్పెషల్ జీవోను విడుదల చేయనుంది ప్రభుత్వం.

 

 

Related News

Etela Rajender: కాళేశ్వరం కేసుపై సీబీఐ విచారణ.. నోరు విప్పిన ఈటల

KCR With KTR: కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, ఇప్పుడేం చేద్దాం?

Supreme Court: స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ ప్రభుత్వానికి రిలీఫ్

Bandi Sanjay: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. తొలిసారి కేంద్రమంత్రి సంజయ్ రియాక్ట్

Telangana RTC: ప్రమాదాల వేళ కొత్త నిర్ణయం..డ్యూటీలో డ్రైవర్లకు ఫోన్ కట్

Big Stories

×