BigTV English

Bigg Boss Agnipariksha : బిగ్ బాస్ అగ్నిపరీక్షలో కంటెస్టెంట్స్ ను ఇబ్బంది పెట్టేది అందుకేనా..?

Bigg Boss Agnipariksha : బిగ్ బాస్ అగ్నిపరీక్షలో కంటెస్టెంట్స్ ను ఇబ్బంది పెట్టేది అందుకేనా..?

Bigg Boss Agnipariksha : తెలుగు బుల్లితెరపై ఎన్నో షోలు ప్రసారమవుతుంటాయి.. ముఖ్యంగా పండగల వేళ ప్రత్యేకమైన ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ ఈవెంట్లు కేవలం ఒక్క రోజుకు మాత్రమే ప్రేక్షకులను అలరిస్తాయి. కానీ బుల్లితెర ప్రేక్షకులను దాదాపు 100 రోజులకు పైగా ఎంటర్టైన్ చేసే ఏకైక షో బిగ్ బాస్. 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో తొమ్మిదో సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ ను చూస్తామని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత సీజన్లో తో పోలిస్తే ఈ సీజన్లో ఎక్కువగా మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.. ముఖ్యంగా సామాన్యులను సెలెక్ట్ చేసేందుకు అగ్ని పరీక్ష ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే కంటెస్టెంట్లను ఇబ్బంది పెట్టడం పై ఇప్పటికే పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు వీళ్ళు జనాలను ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి.. అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారో..? ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


అగ్నిపరీక్షలో కంటెస్టెంట్స్ ను ఇబ్బంది పెడుతున్నారు? 

బిగ్ బాస్ అంటే టాప్ రియాలిటీ షో. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంతో పాటుగా అనేక టాస్కులను కూడా చేయాలి. ఈ టాస్కులు చేసే టైంలో కొట్టుకోవచ్చు.. తిట్టుకోవచ్చు.. బూతులు కూడా వినిపిస్తాయి.. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా కలిసిపోయి రచ్చ రచ్చ చేస్తారు. ఇలాంటి షోలోకి సామాన్యులను పంపించాలంటే షో యాజమాన్యం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. గతంలో కొన్ని తప్పులు జరిగాయని ఇప్పుడు సామాన్యులపై అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని అగ్ని పరీక్షను నిర్వహిస్తున్నారు బిగ్ బాస్. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.


ఈ షోను చూస్తుంటే కొంతమందికి అనేక అనుమానాలు వ్యక్తమౌతూ ఉంటాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. కంటెస్టెంట్లను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో కఠినమైన టాస్కులు ఉంటాయి.. ఒక్కొక్కసారి బిగ్ బాస్ ఇచ్చే టాస్కులలో చేయలేమని మాటలు కూడా వినిపిస్తుంటాయి. వీటన్నిటిని తట్టుకోవడం కోసమే అగ్నిపరీక్షలో అలాంటి కఠినమైన టాస్కులు ఇస్తున్నట్లు ఇప్పటికే ఆ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న నవదీప్ బయటపెట్టారు.. అందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతుంది. సెలబ్రిటీలతో పోటీపడి టాస్కులలో పర్ఫామెన్స్ చేయడానికి ఇలాంటి పరీక్షలు పెడుతున్నట్లు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

Also Read : ఈ వారం అత్యంత దారుణం.. బ్రహ్మముడి పరిస్థితి ఏంటి..?

బిగ్ బాస్ లో ఎవరు రాబోతున్నారంటే..?

గత ఏడాది వచ్చినా బిగ్ బాస్ సీజన్ 8 గురించి ప్రేక్షకులకు ముందుగానే తెలిసిపోయింది. రీసన్ లో రాబోతున్న కంటెస్టెంట్ ల గురించి ఒక వారం పది రోజుల ముందుగానే అనౌన్స్ చేశారు. కానీ ఈ సీజన్ మాత్రం మరో వారంలో ప్రారంభం కాబోతుందని వార్తలు వినిపించినా సరే ఇప్పటి వరకు కంటెస్టెంట్ లా లిస్ట్ మాత్రం బయట పెట్టలేదు. కొందరు సీరియల్ బ్యూటీస్ పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. తాజాగా సీరియల్ యాక్టర్ నవ్య స్వామి కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ పోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఈవారం ఎండింగ్లో షో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లో బిగ్ బాస్ లోకి రాబోతున్న లిస్ట్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే ఈసారి రణరంగమే అంటూ నాగార్జున చెప్పిన డైలాగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. మరి ఎలాంటి యుద్ధాలను చూడాల్సి వస్తుందో చూడాలి..

Related News

Bigg Boss AgniPariksha: చివరిదశకు చేరుకుంటున్న అగ్నిపరీక్ష.. మరీ ఇంతలా ఉన్నారేంటి?

Keerthi bhat: బిగ్ బాస్ వల్ల ఒరిగిందేమీ లేదు..వారివల్ల అయినవాళ్ళు కూడా దూరం!

Bigg boss Agni Pariksha: బ్రెయిన్ టాస్క్ కి ఆడియన్స్ ఫిదా.. మరీ ఇంత తుత్తర అయితే ఎలా?

AgniPariksha: బిగ్ బాస్ అగ్నిపరీక్ష పెద్ద మోసం… జడ్జ్ నవదీప్ పై రెచ్చిపోయిన కంటెస్టెంట్

Bigg Boss9: సామాన్యులను ఆఖరికి పని మనుషులను చేశారు కదరా!

Big Stories

×