Gold Rate Today: శ్రావణమాసం ఆరంభం వేళ.. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. తాజాగా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 92,100 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,480 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలు ఇలా
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,100 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,480 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,100 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,480 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,00,480 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,100 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,00,840 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,450 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఇలా
వెండి ధరలు మాత్ర స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నై, హైదరాబాద్, కేరళలో కిలో వెండి ధర రూ.1,28,000 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీ, కోల్ కత్తా, బెంగళూరూలో రూ.1,18,000 కి చేరుకుంది.
ధరలు పడిపోవడానికి ముఖ్యమైన కారణాలు
1. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు
అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే సూచనలతో.. బంగారంపై ఒత్తిడి పెరిగింది. వడ్డీ రేట్లు పెరిగితే డాలర్ బలం పెరుగుతుంది. బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి. ధర పడిపోతుంది.
2. చైనా బంగారు కొనుగోళ్లు తగ్గించటం
చైనా కేంద్ర బ్యాంక్ తమ బంగారు నిల్వలను పెంచడం.. తాత్కాలికంగా నిలిపివేయడంతో.. గ్లోబల్ మార్కెట్‌లో బంగారంపై ఒత్తిడి పెరిగింది. ఇది బంగారం ధరలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
3. ద్రవ్యోల్బణంపై నియంత్రణ
అమెరికా, యూరోప్ దేశాల్లో ద్రవ్యోల్బణం కొంతమేర నియంత్రణలోకి రావడంతో.. రక్షణాత్మక పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ తక్కువైంది.
4. ఇతర పెట్టుబడి మార్గాలపై ఆకర్షణ
స్టాక్ మార్కెట్లు, బ్రాండ్ మార్కెట్లు లాభదాయకంగా మారుతున్న వేళ, మదుపరులు బంగారం నుంచి నిష్క్రమించి ఇతర పెట్టుబడులవైపు మొగ్గుచూపుతున్నారు.
5. కొనుగోలుదారులకు లాభమా?
ధరల తగ్గుదల వల్ల ఆభరణాలు కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. పెళ్లిళ్లు, వేడుకల కోసం బంగారం కొనాలనుకునే వారు ఈ తరుణాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే మదుపరులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ధరలు ఇంకా దిగే అవకాశం కూడా ఉంది.
Also Read: ఈ కామర్స్ కంపెనీ ‘మింత్రా’ భారీ మోసం.. కేసు నమోదు చేసిన ED
భవిష్యత్‌లో ఏమవుతుంది?
పరిస్థితులను బట్టి చూస్తే, బంగారం ధరలు మరికొంతకాలం పాటు ఒత్తిడిలోనే ఉండే అవకాశం ఉంది.