Sri Devi: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో యంగ్ బ్యూటీ కాకినాడ శ్రీదేవి (Sridevi)ఒకరు. నటనపై ఆసక్తితో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎన్నో రీల్స్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపు పొందిన శ్రీదేవి చివరికి సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇటీవల నాని (Nani) నిర్మాణంలో ప్రియదర్శి, శివాజీ వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన కోర్ట్ సినిమా(Court Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలు జాబిల్లి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన శ్రీదేవి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు.
ప్రేమ కథ సినిమాలు…
ప్రస్తుతం ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరోతో కూడా మరో సినిమాకు కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో శ్రీదేవి ఎంతో బిజీగా గడుపుతున్నారు.. ఇకపోతే ఇటీవల వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ఈమె సినిమా ఇండస్ట్రీ గురించి, హీరోల గురించి, తనకు వస్తున్న సినిమా అవకాశాల గురించి కూడా ఎన్నో విషయాలను తెలియజేశారు. ప్రస్తుతం తనకు తెలుగులో చాలా సినిమా అవకాశాలు వస్తున్నాయని అయితే అవన్నీ కూడా కాలేజ్ బ్యాక్ డ్రాప్, ప్రేమ కథ సినిమాలు కావడంతోనే తాను చేయడం లేదని తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ తో నటించాలని ఉంది…
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సినీ నటుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. తాను మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని అని తెలిపారు . ఇటీవలే తాను చిరంజీవి(Chiranjeevi) గారిని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నానని త్వరలోనే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి తన ఆశీర్వాదాలు తీసుకుంటానని తెలియజేశారు. అదేవిధంగా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఒక సినిమాలో నటించాలని కోరిక కూడా ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు. ప్రస్తుతానికైతే తాను పవన్ కళ్యాణ్ గారితో నటించే అంతస్థాయికి ఎదగలేదు ఆ స్థాయికి చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కచ్చితంగా నటిస్తాను అంటూ ఈమె తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.
డిప్యూటీ సీఎంగా పవన్..
ఇలా పవన్ కళ్యాణ్ గారితో నటించాలనే కోరిక ఉందని తెలియజేయడంతో పలువురు ఆల్ ద బెస్ట్ తెలియజేయగా, మరికొందరు మాత్రం అసలు అది సాధ్యమయ్యే పనేనా? ఆశపడడానికైనా ఓ హద్దు ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం(Deputy CM)గా బాధ్యతలు తీసుకోవడంతో ఈయన పూర్తిస్థాయి రాజకీయ కార్యకలాపాలలో బిజీ కాబోతున్నారు. ఇలాంటి తరుణంలోనే తదుపరి సినిమాలు చేయడం కూడా కష్టమే అని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకుంది.. ఇక ఈ ఏడాది ఈయన నటించిన ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Also Read: Fahad Fazil: సినిమాలకు రిటైర్మెంట్… ఆ పని చేస్తానంటున్న పుష్ప విలన్.. ఇదేం కోరిక సామి?