RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కీలక వడ్డీ రేట్లను ముచ్చటగా మూడోసారి సవరించింది. రెపో రేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ విషయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో ఆయా నిర్ణయాలను తీసుకుంది.
వివిధ దేశాలు తీసుకున్న నిర్ణయాలను వారంలో రోజులుగా పరిశీలింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గవర్నర్ సంజయ్ మల్హాత్రా ఆధ్వర్యంలో ద్రవ్య పరపతి విధాన సమీక్ష కొన్నిరోజులుగా సాగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో కొనుగోలు శక్తి పెంచాలని భావించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వడ్డీ రేట్లు తగ్గితే కొనుగోలు శక్తి పుంజుకుంటుందని భావించింది.
చివరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు కీలక ప్రకటన చేశారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెపో రేటును ఈసారి ఏకంగా 50 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ప్రస్తుతమున్న రెపో రేటు 6 నుంచి 5.50 శాతానికి దిగి వచ్చింది. వడ్డీరేటు తగ్గింపుతో గృహాలు, వాహనాలు, పర్సనల్ లోన్లపై వడ్డీ భారం తగ్గనుంది.
ఈ ఏడాదిలో మూడుసార్లు సవరించింది ఆర్‌బీఐ. ఫిబ్రవరిలో ఒకసారి, ఏప్రిల్ రెండోసారి, జూన్‌లో మూడోసారి వడ్డీరేట్లను తగ్గించింది. తాజా ప్రకటనతో ఇప్పటివరకు రెపో రేటు ఒక శాతం తగ్గినట్లయ్యింది. వడ్డీరేటు తగ్గింపుతో గృహాలు, వాహనాల ఈఎంఐలు తగ్గనున్నాయి. ఇతర రుణాలపై వడ్డీ భారం ఇంకొంచెం తగ్గనుంది.
ALSO READ: ట్రంప్ మామ ఆఫర్.. తులం బంగారు రూ. 56 వేలకే
నగదు నిల్వల నిష్పత్తి 100 బేసిస్ పాయింట్లు తగ్గిండంతో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల బ్యాంకులు రుణాలు మంజూరు చేయవచ్చు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రూ.9.5లక్షల కోట్లు ద్రవ్యాన్ని వ్యవస్థలోకి తీసుకొచ్చినట్టు వివరించారు.
ఈ నిర్ణయం దేశ ఆర్థికవృద్ధిని పెంపొందించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడమే తమ లక్ష్యమన్నారు. గృహ రుణాలు తీసుకునేవారికి వడ్డీ రేటు తగ్గింపు నిర్ణయం శుభవార్త. ఉదాహరణకు కోటి రూపాయల గృహ రుణం 20 ఏళ్లకు 9 శాతం వడ్డీ రేటుతో తీసుకుంటే ఈఎంఐ రూ.89,973 ఉండనుంది. 50 బేసిస్ పాయింట్ల తగ్గించడంతో ఇప్పుడు ఈఎంఐ రూ.86,966 లకు తగ్గనుంది.
ఈ లెక్కన ఏడాదికి 36 వేల ఆదా కానుంది. ఫ్లోటింగ్ రేట్ రుణాలు త్వరగా ఈ ప్రయోజనాన్ని పొందగలవు. ఫిక్స్‌డ్ రేట్ రుణాలపై ఈ మార్పుల ప్రభావం ఉండదని బ్యాకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు నెల కొన్నాయని తెలిపారు. అయినా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు.
వేగంగా వృద్ధి చెందుతోందని, పెట్టుబడిదారులకు అపార అవకాశాలు కల్పిస్తోందని వివరించారు. విదేశీ మారక నిల్వల విషయంలో మరో 11 నెలల వరకు దిగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పకనే చెప్పారు.