బాంబుల మోతలతో.. పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది. ప్రపంచ దేశాలను హెచ్చరికలను లెక్క చేయకుండా.. ఇరాన్‌పై.. ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అయితే.. ఇజ్రాయెల్ చెప్పి మరీ.. ఎటాక్ చేయడమే.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే సమయంలో.. తమ అణు స్థావరాలపై దాడులను.. ఇరాన్ ఎందుకు అడ్డుకోలేకపోయిందన్నది కూడా చర్చకు దారితీస్తోంది. ఆపరేషన్ రైజింగ్ లయన్‌తో.. ఇజ్రాయెల్.. ఇరాన్‌కు షాకిచ్చింది. తమ శత్రు దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు.. ఇజ్రాయెల్ అనేక మోసపూరిత వ్యూహాలను ఉపయోగించింది. ఇందులో డ్యామేజ్ లిమిటేషన్ వ్యూహం ఒకటి. ఇరాన్ తనపై దాడికి సిద్ధంగా ఉందని.. అందువల్ల.. ఇజ్రాయెల్ తమ రక్షణను పటిష్టం చేసుకుంటోందని నమ్మించింది. దాంతో.. ఇరాన్ కాస్త రిలాక్స్ అయ్యేలా చేశారు.
బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య బీకర దాడులు.. అదేవిధంగా అమెరికా జోక్యం వంటి కారణాలతో.. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నేపథ్యంలో తులం బంగారం ధరలు రూ.రెండు లక్షకు చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. యుద్ధ భయాలు కమ్ముకోవడంతో.. ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో తులం బంగారం మళ్లీ రెండు లక్షల వరకు దాటే అవకాశం కనిపిస్తుంది. గత నాలుగు రోజుల్లోనే తులం బంగారం రేటు రూ.4000 వరకు పెరిగింది. మరోవైపు వెండి రేటు సైతం రికార్డు స్థాయిలో పరుగులు పెడుతోంది.
అమెరికా ట్రేడ్ పాలసీ, ట్రంప్ టారీఫ్స్, అదేవిధంగా అమెరికా ద్రవ్యోల్భణం, బంగారం పెట్టుబడులు ఇలా చాలా కారణాలు.. బంగారం ధరలు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్స్ కు 3,433 డాలర్లు దాటింది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఒక ఔన్సుకు 36 డాలర్లకు పైగా పలుకుతోంది. మళ్లీ రికార్జు గరిష్ట స్థాయిలో పరుగులు పెడుతుండటం గమనార్హం. ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ కొద్దిరోజులతో పోలీస్తే.. ఈరోజు స్థిరంగానే ఉంది. ప్రస్తుతం డాలర్‌తో పోలీస్తే.. గ్లోబల్ మార్కెట్లో 86.180 వద్ద అమ్ముడుపోతుంది.
అంతర్జాతీయ మర్కెట్లో బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,01,680 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 93,200 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ ఉద్రిక్తల పరిస్థితులు అలాగే కొనసాగితో మాత్రం.. రాబోయే రోజుల్లో బంగారం ధరలు.. రెండు లక్షకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: కేవైసీ అప్డేట్.. ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు
మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు.. ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, అణు ప్రాజెక్టుపై విస్తృత దాడులు చేశాయి. ఇరాన్ ప్రభుత్వ అణ్వాయుధ ప్రాజెక్టుకు సంబంధించిన టెహ్రాన్‌లోని లక్ష్యాలపై.. విస్తృతమైన దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ లక్ష్యాలలో ఇరాన్ దాచిపెట్టిన అణు ఆర్కైవ్ ప్రదేశం కూడా ఉందని ఐడీఎఫ్ తెలిపింది. దాడులలో ఇద్దరు ఇజ్రాయెలీ పైలట్లను పట్టుకున్నట్లు తెలిపింది ఇరాన్.