Big TV Kissik Talks: వర్ష.. ఒకప్పుడు పలు సీరియల్స్ లో నటిగా నటించి, తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ చిన్నది.. జబర్దస్త్ లోకి అడుగుపెట్టిన తర్వాత భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తోటి కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ తో లవ్ ట్రాక్ నడుపుతూ పంచులు వేస్తూ.. వేయించుకుంటూ చాలా జెన్యూన్ గా అందరి దృష్టిని ఆకర్షించింది వర్ష. ముఖ్యంగా తనను ఎవరు ఏమన్నా చాలా లైట్ గా తీసుకుంటూ ముందుకు సాగే ఈమెకు.. తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో హోస్ట్ గా చేసే అవకాశం వచ్చింది. అలా ఇప్పటివరకు 13 ఎపిసోడ్లను దిగ్విజయంగా పూర్తి చేసింది వర్ష.. స్టార్ హీరోయిన్లను మొదలుకొని.. బుల్లితెర సెలబ్రిటీల వరకు అందర్నీ ఆహ్వానిస్తూ వారి వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేస్తోంది.
ఫ్యామిలీని తలుచుకొని వర్ష ఎమోషనల్..
ఇకపోతే అందరి వ్యక్తిగత విషయాలను, సినిమా విషయాలను బయటపెట్టే వర్ష.. తనను ఎంతమంది ట్రోల్స్ చేసిన చాలా తేలికగా తీసుకుంటూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. అయితే అలాంటి ఈమె జీవితంలో కూడా ఇంత విషాదం ఉంది అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. అసలు విషయంలోకెళితే.. తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ 14వ ఎపిసోడ్ కి ప్రముఖ యాంకర్ భాను శ్రీ (Bhanu Sree) గెస్ట్ గా వచ్చారు ఈ కార్యక్రమంలో రిలేషన్స్ గురించి భాను శ్రీ మాట్లాడుతుండగా.. వర్ష ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ పై నేను నా బాధను చెప్పుకోలేదు. కానీ మొదటిసారి ఇంత పెద్ద స్టేజ్ పై నా బాధలు చెప్పుకుంటున్నాను అంటూ తన రిలేషన్, తన ఫ్యామిలీ గురించి చెప్పి ఎమోషనల్ అయింది.
వర్షా జీవితంలో ఇంత విషాదమా?
వర్ష మాట్లాడుతూ..” మా బావ మరణం తర్వాత మా జీవితాలలో విషాదం మాత్రమే మిగిలింది. మా అక్కను మా బావ లేడు అనే లోటు నుంచి ఇప్పటికీ బయటకు తీసుకురాలేకపోతున్నాము” అంటూ మరింత ఎమోషనల్ అయింది. ఇదే విషయంపై వర్షా మాట్లాడుతూ..” మా అక్క బయటకెళ్ళి ఏదో తీసుకురమ్మని మా బావకు చెప్పిందట. దాంతో మా బావ అప్పుడే తీసుకురావడానికి బయటకు వెళ్లారు. అయితే సడన్గా ఒక బైక్ వచ్చి ఆయనను గుద్దింది. సాధారణంగా బైక్ యాక్సిడెంట్ అంటే గాయాలు మాత్రమే తగులుతాయి. అయితే వెంటనే మా అక్కకు ఫోన్ వచ్చిందట మీ హస్బెండ్ కి యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్లో చేర్చామని.. దాంతో షాక్ అయిన మా అక్క వెంటనే హాస్పిటల్ కి వెళ్ళింది. అయితే కంగారులో ఉన్న అక్కకు గుండె పగిలే న్యూస్ చెప్పారు వైద్యులు .అక్కడికి వెళ్ళగానే మా బావ చనిపోయాడని చెప్పడంతో మా అక్క గుండె ముక్కలు అయింది. అంత్యక్రియల కోసం తీసుకెళ్తుంటే..మా అక్క పిల్లలు నన్ను పట్టుకొని, పిన్ని మాకు పాల ప్యాకెట్ కూడా బయటకెళ్ళి తెచ్చుకోవడం తెలియదు అని ఏడ్చేశారు అంటూ లైవ్లోనే కంటతడి పెట్టుకుంది వర్ష.
ఇక అంతేకాదు తన అక్క తన భర్త లేడు అన్న విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోవడంలేదని, మా బావ బట్టలన్నీ బెడ్ పై వేసి ఆ బట్టల్లో ఆయనని చూసుకుంటుంది అంటూ ఎమోషనల్ అయింది వర్ష. మనిషికి డబ్బు అవసరమే కానీ అదే అత్యవసరం కాదు అని , బంధాలు, బంధుత్వాలు మనిషికి ఎంతో అవసరం అంటూ వర్షా ఎమోషనల్ కామెంట్ చేసింది. ఇక ప్రస్తుతం వర్ష లో ఉన్న ఇంత బాధను చూసి ఆడియన్స్ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు.
ALSO READ:Big TV Kissik Talks: బ్రేకప్ పై భాను శ్రీ క్లారిటీ.. ఇంత డెప్త్ ఉందా?