Weekly Horoscpe( June 16 to 22): గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలు నిర్ణయించబడతాయి. ఈ వారం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి(Aries):
ఈ వారం మేష రాశి వారి జీవితంలో అనేక ముఖ్యమైన మార్పులు కలుగుతాయి. తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదు. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు మీకు హానికరం కావచ్చు. పెట్టుబడులు, ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో పరస్పర అవగాహన, సహకారాలను కొనసాగించండి.
వృషభ రాశి (Taurus):
ఈ వారం మీరు ఆర్థిక విషయాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. చివరకు మీరే విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి.
మిథున రాశి (Gemini):
ఈ వారం మీ జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. వృత్తిలో పురోగతి సాధిస్తారు. మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అంతే కాకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ సంబంధాలలో ఆనందం ఉంటుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి.
కర్కాటక రాశి (Cancer):
ఈ వారం మీరు ఒత్తిడికి లోనవుతారు. పనిలో ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. అయితే మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకు ఓపికగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ధ్యానం చేయడం కూడా మంచిది.
సింహ రాశి (Leo):
ఈ వారం మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్యా రాశి (Virgo):
ఈ వారం మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వృత్తిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన మీకు ప్రశాంతతను ఇస్తుంది.
తులా రాశి (Libra):
ఈ వారం మీకు సామాజిక జీవితం బాగుంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. వృత్తిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి (Scorpio):
ఈ వారం మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. పనిలో అంకితభావంతో పనిచేయడం ద్వారా విజయం సాధిస్తారు. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తినా.. మీరు వాటిని పరిష్కరించగలుగుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం.
ధనస్సు రాశి (Sagittarius):
ఈ వారం మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. వృత్తిలో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. ప్రేమ సంబంధాలు కూడా బాగుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు.
మకర రాశి (Capricorn):
ఈ వారం మీరు ఆర్థిక విషయాలపై ఎక్కువ దృష్టి సారించాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృత్తి పరంగా కొంచెం ఒత్తిడికి లోనవుతారు. కానీ మీరు మీ సామర్థ్యంతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
Also Read: బుధుడి సంచారం.. వీరికి జూన్ నుండి అన్నీ మంచి రోజులే !
కుంభ రాశి (Aquarius):
ఈ వారం వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. వృత్తిలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.
మీన రాశి (Pisces):
ఈ వారం మీరు మీ అంతర్ దృష్టిని నమ్ముకోండి. పనిలో సృజనాత్మకతతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా మధ్యస్థంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో కొన్ని చిన్నపాటి సమస్యలు తలెత్తినా.. మీరు వాటిని పరిష్కరించగలరు. ఆధ్యాత్మికత మీకు బలాన్నిస్తుంది.