RBI New Rules: కస్టమర్లకు ఉపశమనం కల్పించేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా-RBI. దీర్ఘకాలంగా ఉపయోగించని బ్యాంక్ ఖాతాలు, క్లెయిమ్ చేయని డిపాజిట్ ఖాతాలను సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి విడుదల చేసిన కొత్తగా మార్గదర్శకాలు వెంటనే అమలులోకి వచ్చాయి.
నో యువర్ కస్టమర్- KYC అప్డేట్ ఏ బ్యాంక్ బ్రాంచ్‌లోనైనా చేసుకోవచ్చు. అలాగే వీడియో ఆధారిత ధ్రువీకరణ ద్వారా ఆ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. లేకుంటే బిజినెస్ కరస్పాండెంట్ల సహాయంతో చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది ఆర్బీఐ.
పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగించని బ్యాంక్ ఖాతాలను నిలుపుదల చేస్తే వాటిని ఇన్‌ఆపరేటివ్ ఖాతాలు అంటారు. అలాగే పదేళ్ల ఏళ్ల పాటు క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఇందులోకి వస్తాయి. ఇలాంటి ఖాతాల్లోని బ్యాలెన్స్‌ను ఆర్బీఐ నిర్వహించే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కు బ్యాంకులు బదిలీ చేయాలి.
ఈ క్రమంలో స్తంభించిన ఖాతాలు, క్లెయిమ్ చేయని డిపాజిట్ల కోసం KYC అప్డేట్ సౌలభ్యాన్ని తీసుకొచ్చింది ఆర్‌బీఐ. అన్ని బ్యాంక్ బ్రాంచ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ లెక్కన ఖాతా తెరిచిన బ్రాంచ్‌కి ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం లేదన్నమాట. బ్యాంకులు వీడియో ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ద్వారా KYC అప్డేట్ సౌలభ్యాన్ని అందించాలని సూచించింది.
ALSO READ: లక్ష మార్క్‌ని దాటిన పసిడి ధర, ఒక్క రోజే రికార్డు స్థాయిలో
ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, ఎన్నారైలు, గ్రామీణ ప్రాంత ఖాతాదారులకు ఇంటి నుంచే పూర్తి చేయవచ్చు. గ్రామీణ లేదా సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో KYC అప్డేట్ ఖాతా యాక్టివేషన్‌లో బిజినెస్ కరస్పాండెంట్లు సహాయం చేయవచ్చు. స్తంభించిన ఖాతాను యాక్టివేట్ చేయడానికి ఖాతాదారుడు తన KYC వివరాలను ఆ బ్యాంకు బ్రాంచ్ ఆఫీసుల్లో అప్డేట్ చేసుకోవచ్చు.
బ్యాంకులు ఈ సౌకర్యాన్ని కల్పిస్తే మాత్రమే అది సాధ్యమవుతుంది. మీ సమీపంలోని సంబంధిత బ్యాంకుకు వెళ్లాలి. హోమ్ బ్రాంచ్‌కి వెళ్లాల్సిన పని లేదు. ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలతో ఖాతాదారులకు స్తంభించిన ఖాతాలను యాక్టివేట్ చేయడం, క్లెయిమ్ చేయని డిపాజిట్లను తిరిగి పొందడం ఇప్పుడు మరింత ఈజీ కానుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.