Gold Rates Today: భారతదేశంలో బంగారం ధరలు రోజు రోజుకు మిన్నంటుతున్నాయి. బంగారం ధరలు గత మూడు రోజులుగా దూసుకెళ్తున్నాయి. నిత్యావసర ధరలు పెరిగిపోయినట్లు నిత్యం పసిడి ధర పరుగులు తీస్తోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 83 వేల రూపాయల మార్కును చేరుకుంది. దీంతో ఆభరణాలు కొనాలనుకునే వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితితో.. ఒక్కసారిగా బంగారం రేట్లు పెరిగడానికి కారణమంటున్నారు నిపుణులు. అమెరికా నూతన అధ్యక్షుడిగా డోనాల్ట్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత.. ఆయన పాటిస్తున్న వాణిజ్య పరమైన విధానాలతో గోల్డ్‌కి డిమాండ్ పెరుగుతోందని.. బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. శుక్రవారం నాడు ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ. 83,100 చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు లక్షకు చేరుతుందనండంలో అనుమానమే లేదంటున్నారు నిపుణులు. సంవత్సరం క్రితం పోల్చుకుంటే బంగారం సుమారు ఐదు వేలు నుంచి, పది వేలు లోపు తక్కువ ధర ఉండేది.
కానీ ఇప్పుడు ఆకాశాన్నంటుంది. ప్రస్తుతం బంగారం ధర రూ.24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 82,570 ఉంది. మున్ముందు ఇంకెంత పెరుగుతుందో అంచనా వేయలేని విధంగా ఉంది. దీని బట్టి చూస్తే.. మధ్యతరగతి కుటుంబాలు బంగారం కొనే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. ఎన్నికల వేళ ప్రంపంచ ఆర్ధిక స్థితులపైన ప్రభావం చూపేలా వ్యాఖ్యలు చేశారు ట్రంప్. సో దీని వల్ల చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేయడం కానీ.. ఇందనంగా మార్చుకోవడం కానీ రోబోయే రోజుల్లో ఎలా వ్యవహరిస్తారో అని సందిగ్ధత నేపథ్యంలో గానీ, సురక్షితంగా ఒక పెట్టుబడి సాధనంగా గానీ బంగారాన్ని భావిస్తున్నారు.
ప్రస్తుతం బంగారం ధరలు పరిశీలిస్తే..
ఢిల్లీలో ఇవాళ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 75,550 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 82,420 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 75,700 పలుకుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.82,570 కి చేరుకుంది.
విజయవాడలో, గుంటూరు, విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.75,700 పలుకుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.82,570 కి చేరుకుంది.
చెన్నైలో 722 క్యారెట్ల తులం బంగారం ధర రూ.75,700 పలుకుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.82,570 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
కోల్ కతా, కేరళ ఇతర నగరాల్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 75,700 పలుకుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.82,570 వద్ద కొనసాగుతోంది.
Also Read: గుడ్ న్యూస్.. ఎట్టకేలకు 18 పైసలు పెరిగిన రూపాయి విలువ..
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాదిరిగా వెండి దరలు కూడా పరుగులు పెడుతున్నాయి. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో కిలో వెండి ధర రూ.1,05,000 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీ, బెంగుళూరు, కోల్ కతా ఇతర నగరాల్లో కిలో వెండి ధర రూ.97,500 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.