Janhvi Kapoor:దివంగత నటీమణి శ్రీదేవి (Sridevi) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor)తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె ఇంత అందంగా కనిపించడానికి అసలు కారణం ఏమిటి? ఏం ఉపయోగిస్తుంది? ఎలాంటి డైట్ ఫాలో అవుతుంది? అని తెలుసుకోవడానికి అమ్మాయిలు తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే అమ్మాయిల అందాన్ని, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసేలా.. తన ఎనర్జీ డ్రింక్ గురించి చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్ మరి జాన్వీ ఇంత అందంగా, యంగ్ గా, ఫిట్ గా ఉండడానికి తాను తీసుకునే ఆ ఎనర్జీ డ్రింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
జాన్వీ కపూర్ ఎనర్జీ డ్రింక్ అదే..
తెలుగులో కొరటాల శివ (Koratal shiva) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)నటించిన ‘దేవర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె మొదటి సినిమాతోనే తన అందంతో అందరినీ అబ్బుపరిచింది.ఇక ఇప్పుడు బుచ్చిబాబు సనా(Bucchibabu sana) దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న ఆర్సి 16లో హీరోయిన్ గా ఎంపికయింది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ ఫిట్నెస్ గురించి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తాను ఎక్కువగా బ్లాక్ కాఫీ ని తీసుకుంటానని, అదే తన అతిపెద్ద ఎనర్జీ సీక్రెట్ అని తెలిపింది. మరి జాన్వీ తీసుకునే ఈ బ్లాక్ కాఫీ వల్ల నిజంగా కలిగే ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
జాన్వీ ఎనర్జీ డ్రింక్ బ్లాక్ కాఫీ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే?
ప్రతిరోజు బ్లాక్ కాఫీ తాగడం వల్ల.. పార్కిన్సన్స్ వ్యాధి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు . ముఖ్యంగా బ్లాక్ కాఫీలో ఉండే కెఫెన్ నాడీ వ్యవస్థను రక్షించే లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది కూడా.. ఫలితంగా మతిమరుపు వంటి సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంతేకాదు బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ మూడ్ ను సరిచేసి డిప్రెషన్ సమస్యలను దూరం సరిచేస్తుంది. అంతేకాదు ఈ బ్లాక్ కాఫీ ఎనర్జీ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది. దీనిని తాగడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. రోజంతా చురుగ్గా ఉంటారు.అంతేకాదు ముఖ్యంగా రాత్రి సమయంలో వాహనాలు నడిపేవారు ఈ బ్లాక్ కాఫీ తీసుకుంటే మరింత యాక్టివ్ గా ఉంటారు.
డయాబెటిస్ రోగులకు కూడా మంచి ప్రయోజనాలు..
ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడేవారు బ్లాక్ కాఫీ తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. కాఫీ తాగడం వల్ల ఇన్సులిన్ కి ప్రేరణ లభిస్తుంది అని, ఇది టైప్ 2 డయాబెటిస్ ను రాకుండా అడ్డుకోవడంలో సహాయపడుతుంది అని కూడా వైద్యులు తెలియజేశారు. ఇక లివర్ సమస్యలను దూరం చేయడంలో బ్లాక్ కాఫీ ఎంతగానో ఉపయోగపడుతుందట. అయితే మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం లివర్ పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు .దీనికి తోడు బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. పరోక్షంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు బ్లాక్ కాఫీ తీసుకోవాలని కూడా నిపుణులు సూచిస్తున్నారుఇక్కడ మీరు బ్లాక్ కాఫీ తాగాలనుకునేటప్పుడు వైద్యుల సలహా మేరకు తీసుకుంటే మంచిది.