Film industry : ముఖ్యంగా హీరోయిన్స్ అవకాశాలు వచ్చినప్పుడే అందుకోవాలి అనే నేపథ్యంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ జీవితాన్ని సినిమాకే అంకితం చేశారు. అలా కెరియర్లో సూపర్ హిట్లు అందుకుంటూ అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. కానీ వారి వ్యక్తిగత జీవితం మాత్రం శూన్యంగానే మిగిలిపోయింది. ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ముదుర్లుగా మారుతున్నారు.మరి అలా కెరియర్లో సక్సెస్ అయ్యి వ్యక్తిగతంగా జీరోస్ అనిపించుకుంటున్న ఆ హీరోయిన్ ఎవరు ఇప్పుడు చూద్దాం..
అనుష్క..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అనుష్క (Anushka) పేరు ప్రథమంగా వినిపిస్తోంది. తన అందంతో, నటనతో, అమాయకత్వంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. గతంలో ప్రభాస్ ను ప్రేమించిందని వార్తలు వచ్చినా , అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇక ఇటీవల బిజినెస్ మాన్ ను వివాహం చేసుకోబోతోంది అంటూ కొంతమంది కామెంట్లు చేసినా అవి కామెంట్ల వరకే పరిమితం అయ్యాయి. ఇక ప్రస్తుతం ఈమె వయసు 42 ఏళ్ళు.ఇంకా పెళ్లి చేసుకోలేదు. కెరీర్లో సూపర్ సక్సెస్ అందుకున్న అనుష్క వ్యక్తిగతంగా మాత్రం ఒంటరిగానే మిగిలిపోయింది.
త్రిష..
గత రెండు దశాబ్దాలుగా దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది త్రిష (Trisha ). గతంలో రానా, వరుణ్ మనియన్ లతో ప్రేమ విఫలం అవడంతో ఇంకా పెళ్లి చేసుకోలేదని సమాచారం. ఇక ప్రస్తుతం ఈమె వయసు 41 ఏళ్లు. ఇప్పుడు విజయ్ దళపతితో రూమర్స్ వినిపిస్తున్నాయి.
శృతిహాసన్..
కమల్ హాసన్ కూతురిగా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ (Shruthi Hassan)ఆ తర్వాత తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇకపోతే ఇద్దరితో ప్రేమాయణం కొనసాగించి పెళ్లి వరకు వెళ్లాలనుకున్న శృతిహాసన్ మధ్యలోనే ఇద్దరితో బ్రేకప్ చెప్పుకుంది. ఇక ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న ఈమె వయసు 38 ఏళ్ళు .
నగ్మా.
జ్యోతిక అక్క అయిన నగ్మా(Nagma )సినిమాలు మానేసి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు
ప్రస్తుతం ఈమె వయసు 50 ఏళ్లు.ఒకప్పుడు తన అందంతో, నటనతో కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్గా మారిన ఈమె ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తోంది.
కోవై సరళ..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ గా మంచి పేరు దక్కించుకున్న కోవై సరళ (Kovai Sarala)వయసు 60 సంవత్సరాలు దాటిపోయాయి. పెళ్లి మీద నమ్మకం లేకపోవడం వల్ల ఇప్పటికీ ఆమె ఒంటరిగా జీవిస్తోంది.
పూనమ్ బజ్వా..
సేవల్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె కచేరి, ఆరంభం, అరమనే -2 , ముత్తిన కత్తిరిక వంటి సినిమాలలో నటించింది. ప్రస్తుతం ఈమె వయసు 39 ఏళ్లు. ఇప్పుడు ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇంకా వివాహం చేసుకోలేదు.
టబు..
అందాల తార బాలీవుడ్ హీరోయిన్ టబు(Tabu )తెలుగులో ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె వయసు 52 ఏళ్లు. ఇప్పటికీ కూడా వివాహానికి దూరమైంది.అయినా సరే తన అందంతో నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.
ఇక వీరితోపాటు మరెంతో మంది హీరోయిన్లు కెరియర్ లో మంచి సక్సెస్ అందుకొని వ్యక్తిగతంగా ఒంటరి అవడంతో అభిమానులు తెగ ఫీలైపోతున్నారని చెప్పవచ్చు .