BigTV English

INR to US Dollar: గుడ్ న్యూస్.. ఎట్టకేలకు 18 పైసలు పెరిగిన రూపాయి విలువ..

INR to US Dollar: గుడ్ న్యూస్.. ఎట్టకేలకు 18 పైసలు పెరిగిన రూపాయి విలువ..

INR to US Dollar: ఎప్పుడూ క్షీణించిపోయే రూపాయి విలువ ఈ రోజు 18 పైసలు పెరిగి ఒక డాలర్ విలువ రూ.86.26కు చేరింది. గురువారం రోజున రూపాయి వాల్యూ 9 పైసలు క్షీణించిపోయి డాలర్ విలువ రూ.86.44కు చేరగా.. ఈ రోజు ఏకంగా 18 పైసలు పెరిగింది. ఇది ఓక శుభవార్తగా చెప్పవచ్చు.


సానుకూల దేశీయ ఈక్విటీలు, సాఫ్ట్ అమెరికన్ కరెన్సీ ఇండెక్స్ మద్దతుతో ఇవాళ ఉదయం ట్రేడింగ్‌లో US డాలర్‌ మారకంలో రూపాయి విలువ 18 పైసలు పెరిగి ₹86.26కి చేరుకుంది.

రూపాయి విలువ మరింత పెరిగేందుకు త్వరలో కేంద్ర ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందని వ్యాపార వేత్తలు భావిస్తున్నారు.


ప్రస్తుతం US డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.86.26కు చేరింది. గతంలో పోలిస్తే రూపాయి విలువ 18 పైసలు పెరిగింది. యూఎస్ డాలర్ ప్రారంభ వాణిజ్యానికి వ్యతిరేకంగా స్థానిక యూనిట్ కూడా ₹86.33కి చేరింది. గురువారం, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 9 పైసలు క్షీణించి ₹86.44 వద్ద స్థిరపడింది.

ప్రస్తుతం.. గ్రీన్‌బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.15% తగ్గి 107.88 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.22% తగ్గి 78.12 డాలర్లకు చేరుకుంది.

దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ సానుకూలంగా ప్రారంభమయ్యాయి. స్టార్టింగ్ ట్రేడింగ్‌లో 30-షేర్ సెన్సిటివ్ ఇండెక్స్ సెన్సెక్స్ 166.71 పాయింట్లు లేదా 0.22% పెరిగి 76,687.09 వద్ద ట్రేడవుతోంది. అలాగే, బ్రాడ్ బేస్డ్ నిఫ్టీ ట్రేడింగ్ 49.30 పాయింట్లు లేదా 0.21 శాతం పెరిగి 23,254.65 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

Also Read: Women Murder: హైదరాబాద్‌లో దారుణం.. యువతిని ఘోరంగా చంపారు.. ఆపై..?

ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు నిన్న క్యాపిటల్ మార్కెట్‌లలో నికర అమ్మకందారులుగా ఉన్నారు. ఎందుకంటే ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం వారు ₹5,462.52 కోట్ల విలువైన షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు.

Related News

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Gold Rate: వామ్మో.. దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. రికార్డ్ బ్రేక్.

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

Big Stories

×