BigTV English

Gold Price Drop: బంగారం బంపర్ ఆఫర్.. మార్కెట్‌లోకి 9 క్యారెట్ల గోల్డ్.. తులం ఎంతంటే

Gold Price Drop: బంగారం బంపర్ ఆఫర్.. మార్కెట్‌లోకి 9 క్యారెట్ల గోల్డ్.. తులం ఎంతంటే

60 శాతం బంగారం అమ్మకాల తగ్గుదల

9 క్యారెట్లతో మార్కెట్ ని పరుగు పెట్టించే యత్నంజూన్ నెలలో.. భారత్ బంగారు అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీనంతటికీ కారణమేంటని చూస్తేబంగారం ధరలు పెరగటం తగ్గడం వంటి హెచ్చు తగ్గులు అసలు కారణంగా చెబుతున్నారు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్.. 60 శాతం అమ్మకాల తగ్గుదల నమోదైనట్టు రిపోర్ట్ చేసింది.


9 క్యారెట్ల బంగారానికి హాల్ మార్క్ చేసే ఏర్పాట్లు?

మరి ఈ అమ్మకాలను పెంచడానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారో చూస్తే.. ప్రెజంట్ వినియోగదారులను టెంప్ట్ చేయడానికిగానూ.. 14 కేరెక్టర్ల గోల్డ్ ని ప్రమోట్ చేస్తున్నారట. అంతేనా 9 కేరట్ల బంగారాన్ని హాల్ మార్క్ చేయడానికి కూడా చర్చలు జరుగుతున్నాయట. ఈ విషయంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్ మార్కింగ్ పని చేస్తున్నట్టు తెలుస్తోంది.

నెంబర్ వన్- 24, 2- 22, 3- 18, 4- 14

బేసిగ్గా బంగారం క్వాలిటీని బట్టీ దాని ధర ఉంటుంది. అన్నిట్లోకి గ్రేడ్ వన్ 24 కేరెట్స్ కాగా.. నెంబర్ టూ 22. నెంబర్ త్రీ 18 కేరెట్స్. అయితే వీటి ధరల్లో హెచ్చు తగ్గులు.. ఏడాది క్రితం నుంచి అమ్మకాలపై ప్రభావితం చూపిస్తున్నాయి. జూన్ లో బంగారం అమ్మకాల విలువ 35 టన్నులకు పడిపోయినట్టు చెబుతోంది IBJA.

10 గ్రా. రూ. 600 పెరిగి, రూ. 98 వేలు క్రాస్

అలాగని జూలైలో ఏదైనా సరిగా ఉందా అంటే అదీ కనిపించడం లేదు. ఈనెలలో కూడా బంగారు అమ్మకాలు అస్తిరంగానే ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధర 600 పెరిగి రూ. 98 వేల మార్కును దాటింది. రిటైల్ స్థాయిలో వినియోగదారులు 3 శాతం జీఎస్టీతో సహా పది గ్రాముల ధర రూ. 1,00,997కి చేరింది. దేశ వ్యాప్తంగా అనేక బంగారు ఆభరణాల తయారీ యూనిట్లు.. తమ బంగారు ఆభరణాల ఉత్పత్తిని సగానికి తగ్గించారు. కారణం ఇప్పటికిప్పుడు డిమాండ్ పెరిగేలా కనిపించడం లేదని అంటారు IBJA ప్రతినిథులు. ఇది బంగారు అమ్మకాలకు కఠిన సమయంగా భావిస్తున్నారు. అప్పటికీ రకరకాల డిస్కౌంట్లు అందిస్తున్నామనీ.. డిమాండ్ ఎంత మాత్రం పెరగడం లేదని వాపోతున్నారు బంగారు వ్యాపారులు.

3400 డాలర్లకు ఔన్స్ బంగారం ధర

యురోపియన్ యూనియన్, మెక్సికోలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల బెదిరింపుల కారణంగా కొత్త వాణిజ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సుకు 3400 డాలర్లకు చేరినట్టు చెబుతున్నారు ట్రేడ్ నిపుణులు. ఆగస్ట్ 1 వరకూ ట్రంప్ చర్చలు చేసేలా కనిపించడం లేదు. దీంతో బంగారం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు కొందరు నిపుణులు.

యువతను ఆకట్టుకుంటోన్న 14 క్యారెట్ల బంగారం

ధరల పెరుగుదల మధ్య తమ వ్యాపారాన్ని పెంచుకోడానికి 14 కేరెట్ల ఆభరణాలను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు వ్యాపారులు. సంప్రదాయ ఆభరణాల తయారీకి వాడే 22 కేరెట్ల ఆభరణాలతో పోలిస్తే ఈ ధర బాగా తక్కువ. దీంతో ఈ టైప్ జ్యువెలరీని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. 14 కేరెట్ల బంగారం దేశంలో యువతను విశేషంగా ఆకర్షిస్తోందని. దీంతో తామీ మధ్యే మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ ప్రతినిథులు అంటున్నారు.

9 క్యారెట్ల హాల్ మార్క్ ప్రభుత్వ అనుమతి అవసరం

అంతే కాదు 9 కేరెట్ల బంగారానికి హాల్ మార్కింగ్ సదుపాయం కల్పించేలా బ్యూరో ఆఫ్‌ ఇండియన్ స్టాండర్డ్స్ తో కొన్ని రౌండ్ల చర్చలు జరిపింది గోల్డ్ అసోసియేషన్. 9 కేరెట్ల ఆభరణాలను హాల్ మార్కింగ్ చేలా బీఐఎస్ ద్వారా తమకు సమాచారమందినట్టు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ అనుమతి రావల్సి ఉందని అంటున్నారు. ప్రస్తుతం హాల్ మార్కింగ్ 24, 22, 28, 14.. వరకూ మాత్రమే ఉంది. ఒక వేళ 9 కి కూడా వస్తే బంగారు ఆభరణాల ధరలు దిగివచ్చే ఛాన్సు పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తోంది.

నాణ్యత తగ్గించి ధర నేలపైకి తెచ్చే ఎత్తుగడ

అంటే క్వాలిటీ బంగారం ధరను ఎలాగూ తగ్గించలేం. దీంతో నాణ్యతను తగ్గించి.. ధరను నేలపైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది మార్కెట్. అయితే వీటి ద్వారా వచ్చే సమస్య ఏంటంటే.. క్వాలిటీ లెస్ గోల్డ్ మార్కెట్లో ఎక్కువగా హల్ చల్ చేస్తుంది. దీంతో ఒరిజినల్ గోల్డ్ ఎవరికీ అందనంత స్థితికి చేరుతుంది. ఇప్పటికే రకరకాల నాణ్యతా ప్రమాణాలను బట్టీ రకరకాల ధరలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 14 కేరెట్లే ఇప్పటి వరకూ లోయస్ట్ అనుకుంటే, దీనికి 9 కేరెట్లు కూడా వచ్చి కలవడంతో.. మరింత చీప్ గోల్డ్ మార్కెట్ ను ముంచెత్తనుందని అంటున్నారు నిపుణులు.

ఇప్పటికే మార్కెట్లో వన్ గ్రామ్, సిల్వర్ గోల్డ్

ఇప్పటికే బంగారం ధరలకు జడిసిన వినియోగదారులు వన్ గ్రామ్ గోల్డ్, సిల్వర్ గోల్డ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. ఇప్పుడు కొత్తగా 9 కేరెట్ల బంగారం రావడంతో అందరి దృష్టి ఈ ఆభరణాలపై పడేలా తెలుస్తోంది. మరి చూడాలి… ఈ రకం గోల్డ్ మార్కెట్ ని ఎలా పరుగులు పెట్టిస్తుందో తేలాల్సి ఉందంటున్నారు నిపుణులు.

వచ్చే పండగల సీజన్ కి బంగారం అమ్మకాలు పుంజుకునే దారేది?

ఇటు యుద్ధాలు ముగిసిపోయాయి. అటు ప్రపంచ వాతావరణం ఒకటి రెండు చోట్ల తప్ప అంతా ప్రశాంతంగా ఉంది. మరి బంగారం ధరల విషయంలో ఈ హెచ్చు తగ్గులేంటి? ఈ మొత్తం గోల్డ్ వ్యవహారంలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏమంటోంది? ఇంతకీ బంగారం కొనుగోళ్లకు సమయమేది? వచ్చే పండగల సీజన్ కి బంగారం అమ్మకాలు పుంజుకునే దారేది?

US డాలర్, ట్రెజరీ దిగుబడులు పెరిగినా

2024లో 15 శాతం తగ్గుదల తప్ప.. భారత్ లో సేమ్ డిమాండ్ప్రెజంట్ సిట్యువేషన్ పై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏమంటోందంటే.. US డాలర్, ట్రెజరీ దిగుబడులు పెరిగినా, బంగారం ధరలు బలహీన పడవచ్చని అంటోంది. తగ్గించిన సెంట్రల్ బ్యాంకుల బంగారు కొనుగోళ్లు, రిటైలర్ల పెట్టుబడులు కూడా ధరలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు కౌన్సిల్ సభ్యులు.

2022 నవంబర 3న కిందకు వచ్చిన బంగారం ధరలు

ఇటీవలి కాలంలో గోల్డ్ బుల్ రన్ అందరి దృష్టిని ఆకర్షించింది. 2022 నవంబర 3న కిందకు వచ్చిన బంగారం ధరలు.. తర్వాతి కాలంలో ఔన్సుకు 1500 డాలర్ల నుంచి 3300 డాలర్లకు ఎగబాకాయి. అంటే ఏడాదికి 30 శాతం పెరుగుదల నమోదు చేసింది. 2022- 24 మధ్య ద్రవ్యోల్బణం తగ్గడంతో కేంద్ర బ్యాంకులు రేట్ల పెంచడం మధ్య ఈ మార్పు జరిగినట్టు అంచనా వేస్తున్నారు.

సెంట్రల్ బ్యాంకుల బంగారు కొనుగోళ్లు, రిటైలర్ల పెట్టుబడులు

బంగారం ధర కొత్త అంచులకు చేరడంతో ఇన్వెస్టర్లు నష్టాల పట్ల అప్రమత్తంగా ఉంటున్నారు. వీరు బంగారం కొనుగోళ్లు చేయడం కోసం గతంలో బేర్ పరుగును అధ్యయనం చేస్తున్నట్టు చెబుతున్నారు. అంతే కాదు ఏయే పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయో.. అంచనా వేస్తున్నట్టు చెబుతున్నారు. డిమాండ్ అప్ అండ్ డౌన్స్ లో ఒక నిర్మాణాత్మకత ఉండాలని అంటున్నారు నిపుణులు. వివిధ సంస్థలు, రీటైల్ పెట్టుబడిదారుల నుంచి గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్స్ డిమాండ్ తగ్గితే.. సరఫరాలో వేగం పెరుగుతుందని అంటోంది WGC రిపోర్ట్.

ఇవి కూడా బంగారం ధరలను ప్రభావితం చేయొచ్చు

గోల్డ్ కౌన్సిల్ ప్రధానంగా దృష్టి సారించిన వ్యవహారమేంటంటే.. అమెరికా టారీఫుల భయం. ఇవి వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేలా అంచనా వేస్తున్నారు. ఈ మధ్య రష్యా ఉక్రెయిన్ వార్ ని కంట్రోల్ చేయడం కోసం.. యూఎస్.. భారత్, చైనా, టర్కీ, ఇతర ఆఫ్రికన్ కంట్రీస్ పై 500 శాతం సుంకాలను విధిస్తామన్న బెదిరింపులు సైతం చేస్తోంది. అదే జరిగితే.. ప్రపంచం రెండుగా చీలినా చీలుతుంది. ఒక్కసారిగా బిజినెస్ డైనమిక్స్ ఛేంజ్ అయిపోతాయి.

గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్స్ డిమాండ్ తగ్గితే..

అంటే కేంద్రీ బ్యాంకుల కొనుగోళ్లు, యుద్ధ వాతావరణంకన్నా మించింది భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా అత్యంత ప్రమాదకరమే. ప్రపంచాన్ని ఎలాగైనా సరే తమ గుప్పెట్లో పెట్టుకోడానికి యూఎస్ రోజుకో కొత్త నాటకం ఆడుతోంది. సుంకాలతో ఈ ప్రంపంచాన్ని శాసించాలని చూస్తోంది. వీటి వల్ల ఇతర ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఇన్వెస్టర్లు. దీంతో.. వారి చూపు బంగారం వైపు మొగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

అమెరికా టారీఫులే అత్యంత ప్రమాదకరం- WGC

అప్పటికీ మార్కెట్ ని ఉత్సాహ పరిచేందుకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్.. ప్రస్తుతం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయని.. వాణిజ్య ఒప్పందాలు కూడా ఒక కొలిక్కి వస్తున్నాయని అంటోంది. ఈ పరిస్థితులు సానుకూల పడ్డంతో బంగారంపై పెట్టుబడుల ప్రవాహం తగ్గొచ్చని.. తద్వారా బంగారం ధరలు దిగొచ్చే అవకాశముందని చెబుతోంది WGC.

1987లో లండన్ లో స్థాపించిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్

1987లో లండన్ లో స్థాపించిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రధాన ఉద్దేశమేంటంటే.. బంగారం వినియోగాన్ని, డిమాండ్‌ను ప్రోత్సహించడమే ధ్యేయంగా పని చేస్తుంది. తరచూ త్రైమాసిక నివేదికను విడుదల చేస్తూ ఉంటుంది. దీన్ని బట్టీ చూస్తే.. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో బంగారం డిమాండ్ పెరిగింది, ముఖ్యంగా సెంట్రల్ బ్యాంకులు, గోల్డ్ ఇటిఎఫ్ పెట్టుబడుల కారణంగా ఇలా జరిగినట్టు తెలుస్తోంది. అయితే, ఆభరణాల వినియోగం మాత్రం ధరల పెరుగుదల కారణంగా బలహీనంగా ఉందని చెబుతోందీ రిపోర్ట్.

బంగారం వినియోగం, డిమాండ్‌ పెంచడమే ధ్యేయం

గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. డబ్బు విలువ పెంచుకోవచ్చన్న నమ్మకాలే బంగారు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం. భారత్ లో కూడా బంగారం డిమాండ్ భారీగానే పెరిగింది. 2024లో 15 శాతం తగ్గుదల తప్ప.. ఈ డిమాండ్ స్థిరంగానే ఉన్నట్టు నివేదిస్తోంది WGC. ఇదిలా ఉంటే భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గవచ్చని, ముఖ్యంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చల్లబడితే, డాలర్ బలపడితే, ట్రెజరీ రాబడులు పెరిగితే ఇదంతా సాధ్యమేనంటోంది డబ్ల్యూజీసీ.

ధరల పెరుగుదలతో ఆభరణాల వినియోగం తగ్గుదల

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాలు ఎలా ఉన్నా.. అప్పటి వరకూ మార్కెట్ వేచి చూసే ధోరణి అవలంభించదు. కారణం వారికి ఇప్పటికిప్పుడు మార్కెట్ ని ఎలా పరుగులు దీయించాలా? అన్నది మాత్రమే టార్గెట్ గా ఉంటుంది. కారణం వాయా వ్యాపారుల దైనందిన అవసరాలు, నెలవారీ జీతాలు, అద్దెల ఖర్చులు ఈ టార్గెట్ తో మార్కెట్ తన అవసరాల నిమిత్తం రకరకాల ఎత్తుగడలు వేస్తుంది. కాబట్టి.. ఈ రెండింటి ఆలోచనలు అంచనాలకూ చాలా తేడా ఉంటుంది. ఈ విషయం వినియోగదారులు గుర్తించాలని అంటారు నిపుణులు.

Related News

Tesla Sales: ఇండియాలో ఫస్ట్ టెస్లా కార్ ఓనర్ ఆయనే.. ఆ కారు ఫీచర్లు ఇవే

రిటైర్ అయ్యాక ప్రతి నెలా 1 లక్ష రూపాయల పెన్షన్ కావాలా..అయితే ఇలా ఇన్వెస్ట్ చేయండి..?

BSNL Offer: 72 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా.. BSNL నుంచి మరో అదిరిపోయే ప్లాన్!

Today Gold Price: తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు..

Flipkart Offer: ఎంత షాపింగ్ చేసినా సేవింగ్స్ గ్యారెంటీ.. ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్

Jio Special Offers: ఫ్రీ డేటా.. OTT యాక్సెస్.. జియో బర్త్ డే గిఫ్ట్ అదిరిందిగా!

Big Stories

×