శరీరంలో రక్తంలో ఎక్కడ కొలెస్ట్రాల్ పేరుకుపోయినా అది ఆరోగ్యానికి హానికరమే. కొలెస్ట్రాల్ అనేది మైనపు పదార్థంలాగా ఉంటుంది. ఇది మనకి అవసరమైనదే. ఆరోగ్యకరమైన కణాలు నిర్మించడానికి కొంతమేరకు కొలెస్ట్రాల్ అవసరం. కానీ అవసరానికి మించి కొలెస్ట్రాల్ పేరుకుపోతే అది గుండె జబ్బులకు కారణం అవుతుంది. రక్తంలో శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి.
కొన్ని రకాల పండ్లు కూడా ఆహారంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. పండ్లలో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి హృదయా నాళ వ్యవస్థను కాపాడేందుకు తోడ్పడతాయి. పండ్లలోని కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను చాలా వరకు తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థలో ఈ కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ ను బంధిస్తుంది. శరీరం నుండి దాని తొలగించడానికి సహాయపడుతుంది. ఇలా కొలెస్ట్రాల్ ను తగ్గించే శక్తి ఉన్న నాలుగు పండ్ల గురించి ఇచ్చాము. వీటిని ప్రతిరోజు తినేందుకు ప్రయత్నించండి.
పుల్లని పండ్లు
నారింజ, నిమ్మ, ద్రాక్ష పండ్లు వంటి వాటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటికి కొలెస్ట్రాల్ ను తగ్గించే శక్తి కూడా ఎక్కువ. ఈ శక్తివంతమైన పండ్లలో కరిగే ఫైబర్ ఉంటుంది. దాన్నే పెక్టిన్ అని పిలుస్తారు. పెక్టిన్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. ఇక నారింజ, ద్రాక్ష పండ్లలో ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇది ధమనులను కాపాడుతూ ఇన్ఫ్లమేషన్ రాకుండా అడ్డుకుంటాయి.
ఈ సిట్రస్ పండ్లను ప్రతిరోజు తినడం అలవాటుగా మార్చుకోవాలి. నారింజ, ద్రాక్ష ప్రతిరోజు తినాలి. నిమ్మకాయలను నీటిలో పిండి తాగుతూ ఉండాలి. అలాగే ఆహారానికి పై కూడా నిమ్మ రసాన్ని చల్లుకుంటూ తినడం అలవాటు చేసుకోవాలి.
ఆపిల్స్
రోజుకొక ఆపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదని అంటారు. అది ఎంతో నిజం ఆపిల్స్ లో కొలెస్ట్రాల్ తగ్గించే సమ్మేళనమైన పెప్టిన్ ఉంటుంది. అలాగే కరికే, కరగని ఫైబర్ రెండు కూడా ఉంటాయి. ఆపిల్స్ ను ప్రతిరోజు ఒకటి తింటే చాలు.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా వరకు తగ్గిపోతాయి. ఆ పిల్లలో పాలిఫెనాల్స్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తనాళాలను కాపాడతాయి. ఆపిల్ పండ్లను ఓట్స్ తో కలిపి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. నేరుగా తిన్నా కూడా ఆరోగ్యకరమే.
అవకాడోలు
అవకాడోలు క్రీమీ ఆకృతిని కలిగి ఉంటాయి. వీటిలో మోనోసాచురేటెడ్ కొవ్వులు అధికం. వీటిలో ఉండే మంచి కొవ్వులు శరీరంలో హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ప్రతిరోజు ఒక అవకాడోను తింటే చాలు.. కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా వరకు తగ్గుతున్నట్టు పరిశోధనలు నిరూపించాయి. అధిక బరువు, ఊబకాయం వ్యక్తులు కచ్చితంగా అవకాడోను తినాలి.
అరటి పండ్లు
అరటిపండును పేదవాడి పండుగా చెప్పుకోవచ్చు. ఇది అందరికీ అందుబాటు ధరలోనే ఉంటుంది. అరటి పండ్లు కూడా కొలెస్ట్రాల్ తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్లు, మొక్కల ఆధారత సమ్మేళనాలు.. శరీరం కొలెస్ట్రాల్ ను గ్రహించకుండా ఆపుతాయి. అరటిపండ్లు జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడతాయి. బరువు పెరగకుండా అడ్డుకుంటాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అరటిపండు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
అదనపు పోషకాహారం కోసం మీరు అరటి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. తృణధాన్యాలు, పెరుగును కూడా అరటిపండ్లలో వేసుకొని తింటే మంచిది.