E-Paper
Advertisement

సైకోతో ఇంటర్వ్యూ… ట్విస్టులతో మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

సైకోతో ఇంటర్వ్యూ… ట్విస్టులతో మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్
Advertisement

Psychological Thriller Series: 1979లో మాన్‌హాటన్… ఓ యువకుడు తీవ్రమైన నేరం చేసిన కేసులో అరెస్ట్ అవుతాడు. చూడడానికి ఇది సాధారణ క్రైమ్ కేసులానే కనిపిస్తుంది. కానీ అతనితో మాట్లాడటం మొదలు పెట్టిన ఇన్వెస్టిగేటర్‌ కు అతని గతంలో ఎన్నో పొరలు ఉన్నాయని తెలుస్తుంది. ఒక్కో ఇంటర్వ్యూలో ఒక్కో కథ బయట పడుతుంది. అతని మాటల్లో నిజం ఎంత ? దాచిన విషయం ఏంటి ? అనేది అర్థం కాని పరిస్థితి. చివరకు కేసును ఛేదించాలంటే ఆ యువకుడి మనసులోకి వెళ్లాల్సిందే. అలా ఓ సైకో మనసును పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నమే ‘ది క్రౌడెడ్ రూమ్’ (The Crowded Room) సిరీస్ స్టోరీ. మరి ఈ ఇంట్రస్టింగ్ సిరీస్ స్టోరీ ఎక్కడంటే ?

కథలోకి వెళ్తే…

డానీ సల్లివన్ 1979 వేసవిలో మాన్‌హాటన్‌ లో ఓ హింసాత్మక నేరానికి అరెస్ట్ అవుతాడు. అతని కేసును పరిశీలించే పని ర్యా గుడ్‌విన్ అనే ఇన్వెస్టిగేటర్‌ పై పడుతుంది. మొదట డానీ గురించి బయటకు కనిపించే విషయాలు మాత్రమే ఆమెకు తెలుస్తాయి. కానీ అతనితో మాట్లాడుతున్న కొద్దీ అతని గతంలో ఎన్నో సంఘటనలు దాగి ఉన్నాయని ర్యాకు అర్థమవుతుంది.

Advertisement

డానీ తన బాల్యం, కుటుంబం, స్నేహాలు, తన జీవితంలోకి వచ్చిన వ్యక్తుల గురించి చెప్పడం మొదలు పెడతాడు. ముఖ్యంగా అరియానాతో అతనికి ఉన్న స్నేహం, అతని తల్లి క్యాండీతో ఉన్న సంబంధం, చిన్ననాటి అనుభవాలు అన్నీ కేసులో కీలకంగా మారతాయి. ప్రతి విషయం బయటకు వస్తున్న కొద్దీ డానీని అర్థం చేసుకోవడం ర్యాకు మరింత కష్టమవుతుంది. ఒక దశలో ర్యా డానీ చెప్పే విషయాలను కేవలం ఓ నిందితుడి వాంగ్మూలంగా కాకుండా అతని మానసిక స్థితికి సంబంధించిన క్లూస్‌ గా చూడటం మొదలు పెడుతుంది. అతను చెప్పే కొన్ని సంఘటనలు ఒకదానితో ఒకటి సరిపోనట్లు కనిపిస్తాయి. గతంలో జరిగిన ఘటనలు, ప్రస్తుత నేరం మధ్య సంబంధాన్ని ఆమె వెతుకుతుంది.

డానీ జీవితంలో యిట్జాక్ సఫ్డీ వంటి వ్యక్తుల ప్రభావం కూడా కథలో కనిపిస్తుంది. ర్యా తన కెరీర్‌ ను పణంగా పెట్టి డానీ విషయంలో కొత్త సిద్ధాంతాన్ని పరిశీలించాలని అనుకుంటుంది. సాధారణ దర్యాప్తు పద్ధతులు అతని కేసులో సరిపోవని ఆమెకు అనిపిస్తుంది. డానీ చుట్టూ ఉన్న వ్యక్తులు, అతని జ్ఞాపకాలు, అతను చెప్పే కథలు ఒక్కొక్కటిగా కలుస్తున్న కొద్దీ అసలు నేరం వెనుక ఉన్న మిస్టరీపై ఆసక్తి పెరుగుతుంది. ఓ నిందితుడిని ఇంటర్వ్యూ చేస్తున్న విచారణాధికారి కథగా మొదలైన సిరీస్, క్రమంగా మనిషి మనసులోని సంక్లిష్టతను అర్థం చేసుకునే సైకలాజికల్ థ్రిల్లర్‌ గా మారుతుంది. మరి ఇంతకీ చివరికి అతను హత్యలు ఎందుకు చేశాడో చెప్పాడా లేదా ? అలాగే ఆ సైకోతో ఇంటర్వ్యూలో బయట పడిన నిజం ఏంటి ? అనేది తెరపై చూడాల్సిందే.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు ?

Advertisement

టామ్ హాలండ్ (Tom Holland), అమాండా సెయ్‌ఫ్రిడ్ (Amanda Seyfried), ఎమ్మీ రోసమ్ (Emmy Rossum), సాషా లేన్ (Sasha Lane) నటించిన ‘ది క్రౌడెడ్ రూమ్’ను అకివా గోల్డ్‌స్మాన్ (Akiva Goldsman) డెవలప్ చేశారు. Apple TVలో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఇండియా లిస్టింగ్‌ లో తెలుగు సబ్‌టైటిల్స్ ఉన్నాయి, కానీ తెలుగు ఆడియో లేదు. అంటే తెలుగులో డబ్ కాదు గానీ, తెలుగు సబ్‌టైటిల్స్‌తో సినిమాను చూడొచ్చు.

Read Also: యాక్సిడెంట్లో యూనికార్న్ డెత్… రక్తం కోసం మనుషులే రాక్షసులైతే? క్రేజీ హారర్ థ్రిల్లర్

Tags

Related News

టీవీ రేటింగ్స్ కోసం నేరస్థులను లైవ్‌ లో పట్టుకునే రియాలిటీ షో… హై-టెన్షన్ థ్రిల్లర్

11 ఏళ్ల క్రితం మాయమైన కూతురు… కట్ చేస్తే క్రేజీ ట్విస్ట్… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్

శోభనం అయ్యాక మ్యాటర్ లేదంటూ రూమర్స్… పిల్లల్ని కని చూపిస్తే పొలం మొత్తం అతనికే… తెలుగులోనే ఈ ఫ్యామిలీ కామెడీ మూవీ

రాత్రికి రాత్రే పాపులర్… సోషల్ మీడియా స్టార్స్ లైఫ్ ఇంత ఘోరంగా ఉంటుందా ? మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్

ఎడారిలో తప్పిపోయిన బాలుడి సాహసం… ఈ అడ్వెంచర్ మూవీని తెలుగులోనూ చూడవచ్చు

ఇన్ఫినిటీ క్యాసిల్‌లో డెమాన్స్‌పై ఫైనల్ వార్… తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ యాక్షన్ యానిమే

ఉద్యోగం కోసం పోరాటం… కానీ ఆఫీస్‌లో ఎవరినీ నమ్మలేని పరిస్థితి… చైనీస్ వర్క్‌ప్లేస్ డ్రామా

Big Stories

Advertisement
×