E-Paper
Advertisement

Podarillu Today Episode : కొడుకుకోసం ఒప్పుకున్న నారాయణ.. ఫ్యామిలీ ట్రిప్ హైలెట్.. నారాయణ పై రౌడీలు అటాక్..

Podarillu Today Episode :  కొడుకుకోసం ఒప్పుకున్న నారాయణ.. ఫ్యామిలీ ట్రిప్ హైలెట్.. నారాయణ పై రౌడీలు అటాక్..
Advertisement

Podarillu Today Episode august 12th: చక్రి మాధవ ఇద్దరూ కూడా ఒకసారి ఈ పెదనాన్నని మళ్లీ అడిగితే బాగుండు అని అనుకుంటారు.. ఇక పెదనాన్న ఎదురుగా వస్తున్నాడు ఆ గ్రామ దేవత మనల్ని ఎదురుగా పంపించిందేమో అని అనుకుంటారు. అయితే చక్రి మీ పెదనాన్న వస్తున్నాడు మల్ల ఒకసారి అడుగు అని చెప్పగానే మాధవ్ పెదనాన్న గ్రామదేవత గుడి గురించి చెప్పండి అని ఎంతగా అడిగినా సరే చెప్పడు.. కానీ చివరికి చక్రి చేసిన ప్లాన్ వల్ల రమణయ్య ఆ గుడి గురించి చెప్తాడు. మాధవ్ ఒక్కడినే వెళ్లి రమ్మని చెప్పు అని చెప్పగానే చక్రి వాళ్ళందరూ అనుమాన పడతారు. ఇక ఇంటికి రాగానే చక్రీ వాళ్ళందరూ గుడి గురించి చెప్తారు. నారాయణ ఆ గుడి పేరు వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు.

నారాయణ కుటుంబం ఫ్యామిలీ ట్రిప్..

అందరూ కూడా రుద్రవరం వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు.. మొదట నారాయణ వద్దు అని అనుకున్న కూడా కొడుకు కోసం అని చెప్పగానే అందరూ కూడా ఒప్పుకుంటారు. అయితే ఈ నెల తర్వాత మళ్లీ అదే ఊరికి వెళ్తున్నాము అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటారు. అందరూ తమ తమ బ్యాగులతో ఊరికి వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు.. చాలా సరదాగా ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్తారు. మహాలక్ష్మి తో పాటు మనీషా కూడా అక్కడికి వెళ్లాలి అని అనుకుంటారు.. ఇక చక్రి బస్సులో వెళ్లడం ఎందుకు నాకు లైసెన్స్ వచ్చేసింది కదా మనం అందరం కార్లో వెళ్ళిపోదామని చెప్పగానే మనిషా కూడా సరే అని అంటుంది.. అందరూ కలిసి చాలా సరదాగా ట్రిప్పుకని బయలుదేరుతారు..

శైలు దెబ్బకు వరాలు షాక్..

Advertisement

శైలు మీరందరూ ఫ్యామిలీ ట్రిప్పు వెళ్తున్నారా మరి నన్ను వదిలేసి వెళ్తావా అని కేశవతో అంటుంది. ఎలా తీసుకొని వెళ్ళాలి మేమంతా ఫ్యామిలీగా వెళ్తున్నాము అని కేశవ చెప్పగానే.. అయితే నేను కూడా మీ ఫ్యామిలీ నే కదరా.. మనీష్ అని తీసుకెళ్లినప్పుడు నన్ను కూడా తీసుకెళ్లొచ్చు కదా అని శైలు ఫీల్ అవుతుంది.. పెళ్లి కాకుండా మనం ఎక్కడికి వెళ్లలేం కదా అని కేశవ ఏదో ఒకటి చెప్పి శైలు ను ఒప్పిస్తాడు. శైలు కేశవ తో మాట్లాడుతూ ఉండగా మన పెళ్లెప్పుడు అని అంటుంది. అప్పుడే సురేష్ లోపలికి ఎంట్రీ ఇచ్చి ఎవరితో మాట్లాడుతున్నావే కొంచెం కూడా సిగ్గు లేదా నీకు అని అంటాడు.. నేను నా మొగుడితో మాట్లాడుతున్నాను నీకేంటి సమస్య అని అంటుంది.. ఇక వరాలను పిలిస్తే వరాలు ఏం చేస్తాం రా ఏమన్నా కూడా పోలీసులు అంటుంది కదా అని అంటుంది.. వాళ్లు తిడుతున్నారా నువ్వు కొంచెం కూడా భయపడలేదు కదా.. నాకు అలవాటైపోయింది లేరా నువ్వేమీ బాధపడకు అని శైలు అంటుంది..

నారాయణ పై రౌడీలు అటాక్..

నారాయణ వాళ్ళందరూ కూడా చాలా సరదాగా కారులో బయలుదేరగానే అక్కడ ఒక చెట్టు కింద పడిపోతుంది.. ఆ చెట్టును తీయడానికి నారాయణ వాళ్ళు నేను వెళ్తాను. నేను వెళ్తాను అని ఒకరి తర్వాత ఒకరు వెళతారు. అయితే చెట్టును తీసేసిన తర్వాత నారాయణ మీద అటాక్ జరుగుతుంది. అయితే నలుగురు కొడుకులు కూడా నారాయణను నాలుగు దిక్కులా కాపాడుకునేలా రౌడీలను చితకొట్టేస్తారు.. నారాయణని నలుగురు కొడుకులు కూడా కాపాడాలి అని చాలా కష్టపడి పోతూ ఉంటారు.. అందరూ నారాయణని కాపాడేందుకు కష్టపడి రౌడీలను చితక్కొడతారు. మాధవ్ మాత్రం మిమ్మల్ని ఎవరు పంపించారు చెప్పండి అని ఎంత అడిగినా సరే ఆ రౌడీలు చెప్పకుండా అక్కడి నుంచి పారిపోతారు.. వీళ్ళని ఎవరో ఒకరు పంపించి ఉంటారు అని అందరికీ అనుమానం వస్తుంది. కానీ నారాయణ మాత్రం వాళ్ళని చూస్తుంటే దారిదోపిడి అని అర్థమవుతుంది కదా.. మళ్లీ ఎందుకు పదండి వెళ్దామని అందరిని తీసుకొని వెళ్తాడు..

రమణయ్య ప్లాన్ ఇందంతా..?

Advertisement

రమణయ్య అతనికి ఫోన్ చేసి మీ బావ చచ్చిపోయాడా అని అడుగుతాడు.. మా బావ చచ్చిపోలేదు నా మనుషులు వెళ్లి వాళ్ళ చేత తన్నులు తిరిగి ఇక్కడికి వచ్చారు అని అతను అంటాడు.. అయితే అతని మా అక్క కోసం చంపాలని అనుకున్నాను.. నాకు మా అక్కని చంపిన వాడిని చంపి పగ తీర్చుకోవాలని ఉంది. మరి దీంట్లో నీకు లాభమేంటి అని రమణ అని అతను అడుగుతాడు. రమణయ్య ఆ బృందావనం నాది అవుతుంది. వాడు చచ్చిపోతే ఆ ఆస్తికి నేనే అవుతాను కదా నా స్వార్థం నాది నీ స్వార్థం నీది అని అంటాడు. నారాయణ చావుతో మనిద్దరి పగ తీరుతుంది అని ఇద్దరు కూడా ప్లాన్ చేసుకుంటారు..

గాయత్రి ఎంట్రీతో షాక్..

ఇక ఊరిలో గ్రామ దేవత గుడి ఎక్కడుంది అని నారాయణను అడుగుతారు. కానీ నారాయణ మాత్రం నాకు తెలీదు అని చెప్తాడు.. నువ్వు ఇదే ఊర్లో పుట్టావు కదా మరి నీకు ఈ గుడి గురించి ఎందుకు తెలియదో నీ మహాలక్ష్మి అడుగుతుంది.. నేను ఈ ఊర్లో పుట్టాను. కానీ ఎప్పుడో పుట్టాను కానీ ఇప్పుడు ఈ ఊరి గురించి నాకు ఏమీ తెలియదు నన్ను ప్రకృతి పిలుస్తుంది నేను వెళ్తాను అని వెళ్ళిపోతాడు.. ఇక ఊరిలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నా ఫ్రెండ్ కు ఫ్రెండ్ ఒకతను నాకు పరిచయం అయ్యాడు. అతను ఆ ఊరి గ్రామ దేవతను దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు. అతనిని నేను ఫోన్ చేస్తాను అని చక్రి అంటాడు. ఇక అతను ఒక సత్రంలోకి తీసుకొని వెళ్తాడు.. అక్కడ ఆల్రెడీ గాయత్రి తాయరు ఉంటారు వీళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ.. ప్రేమ మాటకు షాక్.. అయ్యో ప్రేమ..

Related News

Intinti Ramayanam : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో రోహిణి కి షాక్.. ప్రభాకు దిమ్మతిరిగే షాక్.. రోహిణికి ఫ్యూజుల్ అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ.. ప్రేమ మాటకు షాక్.. అయ్యో ప్రేమ..

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. గోరింటాకు పెట్టుకున్న కోడళ్లు.. పల్లవి పై అవనికి అనుమానం..

Brahmamudi Serial Today Episode August 12th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐశ్వర్యకు మత్తు మందు ఇచ్చి బెడ్రూంలోకి తీసుకెళ్లిన శశి

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

హీరో శ్రీకాంత్ డైలీ ఇంట్లో ఇలాగే చేస్తారా?

Big Stories

Advertisement
×