భారతీయులకు పెట్టుబడి అనగానే గుర్తుకు వచ్చే సాంప్రదాయ పెట్టుబడులు రియల్ ఎస్టేట్ అలాగే బంగారం అని చెప్పవచ్చు. ఒకప్పుడు బంగారం అనేది కేవలం అలంకరణ వస్తువుగా మాత్రమే ఉండేది కానీ రాను రాను ఇది ఒక ఆస్తిగా మారిపోయింది. సామాన్యంగా భారతీయులు మార్కెట్లలో పెట్టుబడి పెట్టేందుకు అంతగా ఆసక్తి చూపరు. రోజురోజుకు ఈక్విటీ మార్కెట్లో ప్రవేశించే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ, నేటికి కూడా బంగారం అలాగే రియల్ ఎస్టేట్ వంటి సాంప్రదాయ పెట్టుబడి సాధనలో ఇన్వెస్ట్ చేసేందుకే జనం ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దీనికి కారణం లేకపోలేదు భారతీయులు ఎక్కువగా ఒక భౌతిక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండే పెట్టుబడులపైనే ఆసక్తి చూపిస్తుంటారు. బంగారం కానీ, రియల్ ఎస్టేట్ భూములు కానీ కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. వీటి నిర్వహణ కూడా చాలా సులభం. కనుక రియల్ ఎస్టేట్ అలాగే బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు మెజారిటీ భారతీయులు ఆసక్తి చూపించడం సహజం అని చెప్పవచ్చు. అయితే బంగారంలో పెట్టుబడి పెడితే బెటరా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడితే బెటరా అనే సందేహం కలిగితే మాత్రం సమాధానం చెప్పడం కష్టం అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు బంగారం వర్సెస్ రియల్ ఎస్టేట్ రెండింటిలో ఎందులో పెట్టుబడి పెడితే లాభము ఎందులో పెట్టుబడి పెడితే నష్టము రెండింటిని వేసుకుంటూ చూద్దాం.
బంగారం పెట్టుబడి:
ప్రస్తుత కాలంలో బంగారంలో ఫిజికల్ రూపంలోనూ డిజిటల్ రూపంలోనూ రెండు రకాలుగా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే నేటికీ భారతీయులు ఎక్కువగా బంగారాన్ని ఫిజికల్ రూపంలో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. నిజానికి భారతీయులు ఎక్కువగా బంగారాన్ని ఆభరణాల రూపంలోనే పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే బంగారు ఆభరణాలకు అంత గిరాకీ ఉంటుంది. ఇక ఫిజికల్ రూపంలో పెట్టుబడి పెట్టేందుకు మరో సాధనం బంగారం 24 క్యారెట్ల గోల్డ్ బిస్కెట్లను దాచుకోవడమే అని చెప్పవచ్చు. డిజిటల్ గోల్డ్ విషయానికి వచ్చినట్లయితే గోల్డ్ ఈటీఎఫ్ బాండ్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలో ఆఫర్ చేసే డిజిటల్ గోల్డ్ స్కీములు ముఖ్యమైనవిగా చెప్పవచ్చు,
బంగారం మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే లాభాలు:
బంగారం ధర గడచిన 25 సంవత్సరాలలో భారీగా పెరిగింది 2000 సంవత్సరంలో కేవలం 10 గ్రాములకు గానూ కేవలం 5000 రూపాయలు ఉన్నటువంటి బంగారం ధర ప్రస్తుతం ఏకంగా, లక్ష రూపాయలు దాటేసింది. బంగారం ధర దాదాపు 20 రెట్లు పెరిగినట్లు గమనించవచ్చు. బంగారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా స్థిరంగా రాబడి పొందే అవకాశం ఉంటుంది. బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావిస్తారు. బంగారం ఆభరణాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం ద్వారా డబ్బు పొందవచ్చు.
బంగారంలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే నష్టాలు:
బంగారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు లాభాలు పొందవచ్చు కానీ ఫిజికల్ బంగారం కొనుగోలు చేసినప్పుడు ముఖ్యంగా తరుగు, మజూరీ, విషయంలోనూ అదనపు చార్జీలు విధిస్తారు. దీంతోపాటు బంగారం ధర మార్కెట్లో కొంతకాలం స్థిరంగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే బంగారం ధర పెరుగుతుంది. 2010 నుంచి 2015 వరకు గమనించినట్లయితే బంగారం ధర అనుకున్న స్థాయిలో పెరగలేదు. దీన్నిబట్టి బంగారంలో పెట్టుబడి గుడ్డిగా పెట్టడం అనేది చెప్పవచ్చు. బంగారాన్ని నగదుగా మార్చుకోవడం కూడా కాస్త కష్టమైన పని అని చెప్పవచ్చు. ఫిజికల్ బంగారాన్ని విక్రయించినప్పుడు అందులో అనేక రకాల చార్జెస్ ఉంటాయి.
రియల్ ఎస్టేట్ రంగం:
రియల్ ఎస్టేట్ రంగం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన దేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి డిమాండ్ ఉంది. దేశంలోని అన్ని నగరాల్లోనూ పట్టణాల్లోనూ పల్లెల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. ఇందులో భాగంగా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీలను విక్రయిస్తుంటారు. దీనికి తోడు వ్యవసాయ భూములను కూడా ఈ మార్కెట్లో విక్రయిస్తుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో భూమిపై పెట్టే పెట్టుబడి కనుక ఎప్పటికీ నష్టం అనేది రాదని పెద్దలు చెబుతుంటారు. అందుకు తగ్గట్టుగానే రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పుడు వందల వేల రెట్లు మీ పెట్టుబడి పెరిగే అవకాశం ఉంటుంది. దానితో పాటే నష్టాలు కూడా ఉంటాయి.
రియల్ ఎస్టేట్ పెట్టుబడిలో లాభాలు ఇవే:
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టడం ద్వారా చక్కటి లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా నగరాల్లోనూ అభివృద్ధి ప్రాజెక్టులు విస్తరిస్తున్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కు మంచి గిరాకీ ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మీ ప్రాపర్టీ వాల్యూ అనేది ఆ ప్రాంత డెవలప్మెంట్ ఆధారంగా ఉంటుంది. మీ పెట్టుబడికి అనేక రెట్ల లాభం సంపాదించే అవకాశం ఉంటుంది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడిలోని నష్టాలు ఇవే:
రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరంగా రాబడి పొందే అవకాశం ఉండదు. భూముల ధరలు అనేక కారణాలవల్ల పెరగడం తగ్గడం వంటివి జరుగుతుంటాయి. న్యాయపరమైన చిక్కులు కూడా ఎక్కువగా ఉంటాయి.
Disclaimer: ఈ వ్యాసంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది ఆర్థిక సలహా కాదు. పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించండి. రియల్ ఎస్టేట్, బంగారం పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి.