Big Stories

Hero MotoCorp: ఈ స్కూటర్ అమ్మకాలు భలే భలే.. మార్చి నెలలో మహా అద్భుతం..!

Hero MotoCorp
Hero MotoCorp

Hero MotoCorp: హీరో మోటోకార్ప్‌కు భారతదేశంలో భారీ డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి వాహనాలు లాంచ్ అవుతున్నాయంటే ముందుగానే బుకింగ్ చేసుకోవడానికి కస్టమర్లు ఎగబడుతుంటారు. ఇప్పటికే విడుదలైన ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ మాత్రమే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్, మోటార్‌సైకిల్ తయారీ సంస్థ కూడా.

- Advertisement -

ఈ కంపెనీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీ స్థాయిలో ద్విచక్ర వాహనాలను అమ్మింది. మొత్తం 56,21,455 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అందులో దేశీయ అమ్మకాలు, ఎగుమతులు రెండూ కూడా ఉన్నాయి. కాగా FY 24 నాలుగో త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 10 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

- Advertisement -

అంతేకాకుండా హీరో మోటోకార్ప్ గ్లోబల్ బిజినెస్ కూడా మొత్తం ఆర్థిక సంవత్సరంలో 16 శాతం వృద్ధిని సాధించి అదరగొట్టింది. మార్చి 2023లోనే కంపెనీ 490,415 మోటార్‌సైకిళ్లు, స్కూటర్లను విక్రయించి అబ్బురపరచింది. అలాగే హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు కూడా పెరిగాయి.

Also Read: పల్సర్ నుంచి మరో కొత్త బైక్.. N250 లాంచ్

కంపెనీ మార్చి నెలలో 4000 కంటే ఎక్కువ విడా వి1(VIDA V1) ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. అయితే ఇది ఎంతో అద్భుమని చెప్పాలి. ఇప్పటివరకు కంపెనీ దాని ఎలక్ట్రిక్ స్కూటర్లలో అత్యధిక నెలవారీ అమ్మకాలు ఇవే కావడం గమనార్హం.

తన ఎలక్ట్రిక్ బ్రాండ్ అయిన విడాను అందరికీ అందుబాటులో ఉంచేలా.. హీరో మోటోకార్ప్ దేశంలోని 100 కంటే ఎక్కువ నగరాలకు విస్తరించింది. గత ఆర్థిక సంవత్సరంలో.. హీరో మోటోకార్ప్ ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలో అనేక బైక్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్, ఎక్స్‌ట్రీమ్ 200ఎస్, ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వి, హార్లే-డేవిడ్‌సన్ ఎక్స్440, కరిజ్మా ఎక్స్‌ఎమ్‌ఆర్, మావ్రిక్ 440 వంటి బైక్‌లు ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News