BigTV English

Viswak Sen: ఎన్టీఆర్ బిగి కౌగిలిలో బందీ అయిన విశ్వక్..

Viswak Sen: ఎన్టీఆర్ బిగి కౌగిలిలో బందీ అయిన విశ్వక్..


Viswak Sen: ఎంత పెద్ద స్టార్ హీరోకి అయినా తనకు నచ్చిన ఒక హీరో ఉంటాడు. అలాగే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కు నచ్చిన హీరో ఎన్టీఆర్. ఇది సినిమాల్లోకి వచ్చాకా కాదు. రాకముందు కూడా విశ్వక్ కు.. ఎన్టీఆర్అంటే ఎనలేని అభిమానం. ఈ విషయం ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఎంతమంది హీరోలు ఉన్నా కూడా ఎన్టీఆర్ ను తప్ప తానెవరిని అంతగా ఇష్టపడనని చెప్పుకొచ్చాడు.

ఇక ఎన్టీఆర్ కు సైతం విశ్వక్ అంటే ఇష్టం. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా కాదనకుండా చేస్తాడు. ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ అన్ని పనులు ఆపుకొని మరీ వచ్చాడు. వీరిద్దరూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తో కూర్చొని తాగుతూ ఉంటే భయమేస్తుందని, అన్న ఉదయం షూటింగ్ ఉందని చెప్పినా కూడా ఏయ్ అనగానే ఆగిపోతాను అని చెప్పుకొచ్చాడు.


ఇక తాజాగా వీరిద్దరూ మరోసారి కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోను విశ్వక్.. సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ లవ్ యూ అన్న అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ ఫొటోలో విశ్వక్ ను తన బిగి కౌగిలిలో బంధించేశాడు తారక్. ఫ్యాన్ బాయ్ విశ్వక్.. ఆ కౌగిలిలో నవ్వుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. నిన్ననే ఎన్టీఆర్ గోవా నుంచి వచ్చిన విషయం తెల్సిందే. వచ్చిరాగానే విశ్వక్ ను కలిసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫొటోలో తారక్ చాలా సన్నగా కనిపిస్తున్నాడు.

ప్రస్తుతం దేవర షూటింగ్ కోసం గోవా టూ హైదరాబాద్ తిరుగుతున్నాడు ఎన్టీఆర్. విశ్వక్ నటించిన గామిపై తారక్ ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. ఇకపోతే విశ్వక్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కూడా రెడీ అవుతుండగా.. మెకానిక్ రాఖీ, లైలా సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఈ ఫోటో చూసిన అభిమానులు ఫ్యాన్ బాయ్ మూమెంట్.. మాకెప్పుడు వస్తుందో అని కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Big Stories

×