BigTV English

Snake bites School Students: పాఠశాలలో కలకలం.. ముగ్గురు విద్యార్థులను కాటేసిన పాము?

Snake bites School Students: పాఠశాలలో కలకలం.. ముగ్గురు విద్యార్థులను కాటేసిన పాము?

Snake bites School Students: గద్వాల జిల్లాలోని ఓ పాఠశాలలో పాము కలకలం సృష్టించినట్లు తెలుస్తోంది. ముగ్గురు విద్యార్థులను కాటు వేయడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల ప్రకారం వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ ఆఫీసు వెనుక ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాళలకు చెందిన ముగ్గురు విద్యార్థులను పాము కరిచింది. శనివారం మధ్యాహ్నం మూత్ర విసర్జనకు వెళ్లిన నలుగురు విద్యార్థుల్లో ముగ్గురిని పాము కాటేసింది.


శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ మెకానిక్ షాపులో పనిచేస్తున్న మైనర్ బాలుడు అనిల్ కుమార్, కేటి దొడ్డి మండలంకు చెందిన సంతోష్ నాయక్, ఐజ మండలంకు చెందిన అర్జున్ కుమార్, గద్వాలకు చెందిన వీరేంద్ర చార్యులను చైల్డ్ ప్రొటెక్షన్, లేబర్ అధికారులు పట్టుకుని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో వదిలారు. ఈ నలుగురు విద్యార్థులు శనివారం మూత్ర విసర్జనకు బయటకు వెళ్లారు. అక్కడ పాముకాటుకు గురికావడంతో హుటాహుటిన గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు క్షేమంగానే ఉన్నారని వైద్యలు తెలిపినట్లు సమాచారం.

Also Read: డ్రగ్స్‌ను అరికట్టేందుకు మాస్టర్ ప్లాన్.. ప్రహరీ క్లబ్స్‌తో నిఘా


విద్యార్థినులను కరిచిన ఎలుకలు..

అదేవిధంగా.. మెదక్ జిల్లా రామాయంపేటలోని గురుకుల హాస్టల్ లో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన మరువక ముందే మెదక్ జిల్లా నర్సాపూర్ లోని అల్లూరి సీతారామరాజు గురుకులంలోనూ విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. నర్సాపూర్ పట్టణ సమీపంలోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకులంలో విద్యనభ్యసిస్తున్న నలుగురిని శుక్రవారం ఎలుకలు కరిచినట్లు ఆ వార్తా కథనంలో పేర్కొన్నారు.

Tags

Related News

Telangana: భయం గుప్పిట్లో చందనపల్లి గ్రామం.. నెల రోజుల్లో 20 మంది బలి

CM Progress Report: దేశానికే ఆదర్శం టీ -ఫైబర్.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తెలంగాణ

Telangana Bandh: ఈనెల 14న తెలంగాణ రాష్ట్రా బంద్.. ఎందుకంటే..?

Global Study Expo 2025: గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో- 2025, తక్కువ ఖర్చుతో విదేశీ విద్య, స్టూడెంట్స్ మాటల్లో

Hyderabad Accident: ఎల్‌బీనగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం, బైక్‌ని ఢీ కొట్టిన కారు, నుజ్జుయిన కారు

Innovation Hub: ఈ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు: శ్రీధర్ బాబు

Vemulawada Temple: రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు.. రేపటి నుంచి భీమేశ్వరాలయంలో దర్శనాలు

Janagam District: రియల్లీ గ్రేట్.. ఆటోలోనే పురుడు పోసిన ఆశా వర్కర్లు.. జనగాం జిల్లాలో ఘటన

Big Stories

×