E-Paper
Advertisement

World Championship Of Legends 2024: నేడే లెజెండ్స్ ఫైనల్ మ్యాచ్.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్

World Championship Of Legends 2024: నేడే లెజెండ్స్ ఫైనల్ మ్యాచ్.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్

World Championship of Legends 2024 India vs Pakistan Final Match: ఎప్పుడెప్పుడు.. ఎక్కడెక్కడ.. ఎవరెవరు ఆడినా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు. భారత్-పాకిస్థాన్ క్రికెట్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే, ప్రపంచ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజండ్స్ 2024 ఫైనల్ మ్యాచ్ నేడు ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా రాత్రి 9గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. జింబాబ్వేతో జరుగుతున్న టీమ్ ఇండియా నాలుగో టీ 20 మ్యాచ్ అయిన ఒక గంటకి ఈ మ్యాచ్ స్టార్టవుతుంది.

సెమీఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను తుక్కుతుక్కు కింద మన లెజండరీ ఆటగాళ్లు కొట్టేయడంతో ఒక్కసారి పాకిస్తాన్ తో జరిగే హై ఓల్టేజీ మ్యాచ్ కి హైప్ పెరిగిపోయింది. సెమీఫైనల్ లో యువరాజ్ సింగ్ (28 బంతుల్లో 59, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించాడు.

తనకి తోడుగా ఓపెనర్ రాబిన్ ఉతప్ప ( 35 బంతుల్లో 65, 6 ఫోర్లు, 4 సిక్సర్లు), పఠాన్ బ్రదర్స్ ఇర్ఫాన్ (19 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), యూసఫ్ (23 బంతుల్లో 51, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అందరూ  విరుచుకుపడ్డారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. అందుకు బదులుగా ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 86 పరుగులతో విజయభేరి మోగించి ఫైనల్ కి చేరింది.

Also Read: టెస్టు క్రికెట్‌లో అరుదైన బౌలర్ జేమ్స్ ఆండర్సన్.. అతని పేరున్న రికార్డ్స్ ఇవే..

ప్రపంచ ఛాంపియన్ షిఫ్ ఆఫ్ లెజెండ్స్-2024 టోర్నీలో  గ్రూప్ స్టేజ్‌లో భారత జట్టు పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఫైనల్‌లో గెలిచి బదులు తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. పాకిస్థాన్ జట్టుకు యూనిస్ ఖాన్ సారథిగా ఉన్నాడు. యువరాజ్ సింగ్ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఈ టోర్నీలో మొత్తంగా భారత్, పాకిస్థాన్, వెస్టిండీస్, పాకిస్థాన్, దక్షఇణాఫ్రికా, ఇగ్లాండ్ ఆరు జట్లు పాల్గొన్నాయి. అందులో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలు లీగ్ దశ నుంచే నిష్క్రమించాయ. తొలి సెమీఫైనల్లో వెస్టిండీస్‌ను ఓడించి పాకిస్థాన్.. రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి భారత జట్టు ఫైనల్‌కు చేరాయి. ఇప్పుడు రాత్రి 9 గంటలకు హై ఓల్టేజీ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Tags

Related News

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

Big Stories

×