BigTV English

Honda Activa E vs Suzuki e-Access: హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్.. ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లో ఎది బెస్ట్ అంటే?

Honda Activa E vs Suzuki e-Access: హోండా యాక్టివా,  సుజుకి యాక్సెస్.. ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లో ఎది బెస్ట్ అంటే?

Honda Activa vs Suzuki: దేశీయ టూ వీలర్ మార్కెట్లో అగ్రాగామి సంస్థలుగా కొనసాగుతున్న హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, సుజుకి మోటార్ సైకిల్ ఇండియా సంస్థలు అదిరిపోయే స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ రెండు కంపెనీలకు సంబంధించి దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న యాక్టివా, యాక్సెస్‌ స్కూటర్లను ఎలక్ట్రిక్ వెర్షన్లను మార్కెట్ కు పరిచయం చేసింది. ఈ రెండు కంపెనీలు యాక్టివా, యాక్సెస్ 125తో ICE స్కూటర్ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు హోండా యాక్టివా ఇ,  సుజుకి ఇ-యాక్సెస్ మార్కెట్లో పోటీ పడబోతున్నాయి. ఈ రెండు స్కూటర్లకు సంబంధించిన ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి? రేంజ్ ఎంత ఉండబోతోంది? ధర ఎంత ఉంటుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


హోండా యాక్టివా ఇ

హోండా యాక్టివా ఇ ప్రారంభ ధరను కంపెనీ రూ. 1,17,000 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ స్కూటర్లను తొలి దశలో మూడు నగరాల్లో అందుబాటులోకి రానుంది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ మార్కెట్లో లభించనున్నాయి. ఫిబ్రవరి నుంచి బెంగళూరులో ఈ స్కూటర్లు డెలివరీ కానున్నాయి. అటు ఏప్రిల్ నుంచి ఢిల్లీ, ముంబైలలో డెలివరీ మొదలుకానున్నాయి.


ఒక ఛార్జ్ తో 102 కి. మీ రేంజ్

యాక్టివా ఇలో  6Kw మాగ్నెట్ సింక్రోనస్ మోటారును ఏర్పాటు చేయనున్నారు.  ఒక్కొక్కటి 1.5kWh చొప్పున రెండు బయటకు తీసే లిథియం-అయాన్ బ్యాటరీలు ఉండనున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్‌ పై 102 కి.మీ రేంజ్ పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఈ బ్యాటరీను ఇంట్లో ఛార్జ్ చేయలేరు. హోండా ఇ: స్వాప్ స్టేషన్లలో మాత్రమే మార్చుకోవాలసి ఉంటుంది.  ఈ స్కూటర్ గరిష్టంగా 80 కి. మీ వేగంతో ప్రయాణిస్తుంది. హోండా యాక్టివా ఇ 5 రంగుల్లో అందుబాటులో ఉంది. పెర్ల్ సెరినిటీ బ్లూ, పెర్ల్ మిస్టీ వైట్, మాట్టే ఫాగీ సిల్వర్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెర్ల్ షాలో బ్లూలో లభించనుంది.

సుజుకి ఈ-యాక్సెస్

సుజుకి నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పో 2025లో దీనిని ఆవిష్కరించారు. దీని ధరను త్వరలో వెల్లడించనున్నారు. సుజుకి ఇ-యాక్సెస్ ధర రూ. 1.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఒక ఛార్జ్ తో 95కి. మీ రేంజ్

ఈ-యాక్సెస్ 3.07kWh తో కూడిన లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. 4.1kW  మాగ్నెట్ సింక్రోనస్ మోటారుతో వస్తుంది. ఫుల్ ఛార్జ్ మీది  95 కి.మీ రేంజ్ అందించనుంది. పోర్టబుల్ ఛార్జర్‌ని ఉపయోగించి 6 గంటల 42 నిమిషాల్లో 0% నుంచి 100% వరకు ఛార్జ్ చేయవచ్చు. ఫాస్ట్ ఛార్జర్‌ ని ఉపయోగించి 2 గంటల 12 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్ గరిష్టంగా 71 కి. మీ వేగంతో ప్రయాణిస్తుంది.  సుజుకి ఇ-యాక్సెస్ మూడు డ్యూయల్-టోన్ కలర్స్ లో వస్తున్నది. మెటాలిక్ మాట్టే బ్లాక్ నం.2/మెటాలిక్ మాట్టే బోర్డియక్స్ రెడ్, పెర్ల్ గ్రేస్ వైట్/మెటాలిక్ మాట్టే ఫైబ్రోయిన్ గ్రే, పెర్ల్ జాడే గ్రీన్/మెటాలిక్ మాట్టే ఫైబ్రోయిన్ గ్రే రంగుల్లో లభిస్తుంది.

Read Also: రూ. 2 లక్షలకే టాటా నానో ఈవీ, ఫీచర్లు చూస్తే అవాక్కవ్వాల్సిందే!

Related News

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Big Stories

×