BigTV English

Second Hand Bikes : మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటే.. టాప్ 5 ఇవే

Second Hand Bikes : మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటే.. టాప్ 5 ఇవే

Second Hand Bikes : ఇటీవల కాలంలో బైక్ అనేది ప్రతి ఒక్కరికి అవసరంగా మారింది. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఉపాధికి కూడా బైకు ఓ ఆయుధంగా ఉంది. రోజువారి ప్రయాణాలతో పాటు చిన్నచిన్న అవసరాలకు బైకును ఉపయోగిస్తుంటారు. అయితే బైక్‌ను ఒకేసారి మొత్తం చెల్లించి కొనుగోలు చేయాలంటే చాలా మంది భయపడుతుంటారు. తీరా ఈఎమ్‌ఐ ద్వారా కొనుగోలు చేయలన్నా ఆ భారం భరించలేక ఆగుతుంటారు. ఈ క్రమంలోనే కొత్త బైక్‌ కొనుగోలు చేయలేని చాలా మంది సెకండ్ హ్యాండ్ బైక్‌లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.


అయితే మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ముందు చాలా విషయాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మైలేజ్, పెర్ఫార్మెన్స్ గురించి చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అటువంటి పరిస్థితిలో అద్భుతమైన పనితీరును అందించే సెకండ్ హ్యాండ్ బైకులు ఐదు ఉన్నాయి. ఇవి ధర, మైలేజ్, పెర్ఫార్మెన్స్ పరంగా మెరుగ్గా ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకోండి.

Also Read : చరిత్ర సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్


Hero Splendor Plus
ఇది దేశీయ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న బైక్. ఈ బైక్‌ను డ్రైవింగ్ కూడా చాలా సులభం. అంతేకాకుండా ఈ బైక్ ఎక్కువ మైలేజీని కూడా ఇస్తుంది. బైక్ నడపడం నేర్చుకోవాలనుకునే చాలా మంది ఈ బైక్‌ను సెకండ్ హ్యాండ్‌గా కొనుగోలు చేస్తారు. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో ఈ బైక్ ధర రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఉండొచ్చు.

Bajaj Pulsar
మీరు మంచి పవర్‌ఫుల్ బైక్‌ను నడపాలని కోరుకుంటే బజాజ్ పల్సర్‌ని కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ పనితీరు అద్భుతంగా ఉంటుంది. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో ఈ బైక్ ధర రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు ఉండొచ్చు.

Royal Enfield Classic 350
ఇది యువత డ్రీమ్ బైక్. అయితే ఈ బైక్‌ను చాలా మంది అధిక ధరతో కొనుగోలు చేయలేకపోతున్నారు. కానీ సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో ఈ బైక్ ను రూ.90 వేల నుంచి రూ.1.5 లక్షల ధరతో కొనుగోలు చేయవచ్చు.

TVS Apache RTR 160
మీకు స్టోర్టీ లుక్‌తో మంచి బైక్ కావాలనుకుంటే ఈ  బైక్‌ను కొనుగోలు చేయండి. ఈ బైక్ మీకు స్ట్రీట్ రైడింగ్, సిటీ రోడ్లు, హైవే‌పై మంచి డ్రైవింగ్ ఫీల్‌ను అందిస్తాయి.

Also Read : వాంటేజ్ నుంచి స్పోర్ట్స్ కార్.. ధర ఎంతో తెలుసా?

Honda Cb Unicorn 150
ఈ బైక్ సెకండ్ హ్యాండ్ బైకుల్లో చాలా పాపులర్. ఈ బైక్ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. అలానే మెయింట్నెస్ కూడా తక్కువే . దూర ప్రయాణీకులకు ఈ బైక్ మంచి ఎంపిక. దేశంలో ప్రతిరోజూ లక్షల బైక్‌లు అమ్ముడవుతున్నాయి. కొత్త బైక్‌లు కొనడం కంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్ నుండి బైక్ కొనడం మంచిది.

Tags

Related News

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Big Stories

×