Big Stories

Kondagattu: కిక్కిరిసిన కొండగట్టు.. వైభవంగా హనుమాన్ జయంతి

Hanuman Jayanthi In Kondagattu: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే స్వామి వారికి ఆలయ అర్చకులు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీక్షాపరులు స్వామి సన్నిధిలో దీక్షా విరమణ చేస్తున్నారు.

- Advertisement -

నిన్న రాత్రి నుంచి భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అర్థరాత్రి నుంచి సుమారు 50 వేల మంది దీక్షాపరులు అంజన్నను దర్శించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిన్న ప్రారంభమైన హనుమాన్ జయంతి ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. రేపు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Also Read: కొండగట్టు అంజన్న చరిత్ర గురించి తెలుసా..?

కొండగట్టుకు మాల విరమణ కోసం హనుమాన్ భక్తులు వేలాదిగా తరలివస్తుండటంతో స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. కొండగట్టు రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన హనుమాన్ దేవాలయం కావడంతో చుట్టు ప్రక్కల రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. శ్రీ రామ జయరామ జయ జయ రామ నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వేకువ జాము నుండి కోనేటిలో స్నానాలు ఆచరిస్తున్నారు. నేడు చైత్ర పౌర్ణమితో పాటు స్వామికి ఇష్టమైన మంగళవారం కావడంతో పంచామృత అభిషేకం, సహస్ర నాగావళి దళార్చన పూజలు చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News