E-Paper
Advertisement

హైదరాబాద్ సిటీ కొత్త రికార్డు.. ఆఫీస్ మార్కెట్ ఆల్ టైమ్ రికార్డ్, ఏకంగా 21.6 శాతం

హైదరాబాద్ సిటీ కొత్త రికార్డు.. ఆఫీస్ మార్కెట్ ఆల్ టైమ్ రికార్డ్, ఏకంగా 21.6 శాతం
Advertisement

Hyderabad City: హైదరాబాద్ సిటీ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆఫీసు మార్కెట్ లీజింగ్‌లో బలమైన రికార్డును నమోదు చేసింది. ఇదే సమయంతో పోలిస్తే ఇది 21.6 శాతం అధికమని వాణిజ్య రియల్ ఎస్టేట్ సేవల సంస్థ  విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.

హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఆఫీస్ లీజింగ్

Advertisement

హైదరాబాద్ నగరంలో ఆఫీస్ మార్కెట్ విషయంలో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. 2026 ఏడాది మొదటి త్రైమాసికం అంటే జనవరి నుంచి మార్చి వరకు ఆఫీస్ స్థలాల లీజింగ్ కార్యకలాపాలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరింది. గడిచిన మూడు నెలల్లో ఏకంగా 31.5 లక్షల చదరపు అడుగుల స్థలం లీజుకు వెళ్లిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ సేవల సంస్థ కుష్‌మ‌న్ అండ్ వేక్‌ఫీల్డ్ వెల్లడించింది.

పోయిన ఏడాది ఈ సమయంతో పోలిస్తే దాదాపు 21.6 శాతం అధికమని తేల్చేసింది. దేశవ్యాప్తంగా జరిగిన ఆఫీస్ లీజింగ్ సుమారు 2.2 కోట్ల చదరపు అడుగుల్లో హైదరాబాద్ వాటా దాదాపు 14 శాతం. దీంతో భాగ్యనగరం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. త్రైమాసికంలో జరిగిన లావాదేవీల్లో భారీ ఒప్పందాలు జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement

తొలి త్రైమాసికంలో 21.6 శాతం వృద్ధి-కుష్‌మ‌న్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక

లక్ష చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న పెద్ద లావాదేవీలు లీజింగ్ కార్యకలాపాలలో దాదాపు 81 శాతం వాటాను కలిగి ఉంది. మధ్య తరహా ఒప్పందాలు అంటే 25000–99999 చదరపు అడుగులు లావాదేవీలు దాదాపు 17 శాతం వాటా ఉంది. కార్యకలాపాల్లో అత్యధికంగా 91 శాతం లీజింగ్ కేవలం మాదాపూర్‌లో ప్రాంతంలో జరగడం మరో విషయం.

హైదరాబాద్ సిటీలో కొత్తగా ఆఫీస్ భవనాల నిర్మాణం పూర్తి కాలేదు. కాకపోతే డిమాండ్ బలంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో 22.1 లక్షల చదరపు అడుగుల స్థలం వినియోగంలోకి వచ్చింది. అదే సమయంలో ఖాళీగా ఉన్న ఆఫీస్ స్థలాలు 20.22 శాతానికి తగ్గినట్లయ్యింది. మాదాపూర్‌లో ఖాళీ స్థలం కేవలం 7.5 శాతానికే పరిమితమైంది. ఆ ప్రాంతంలో ఏ-గ్రేడ్ భవనాల్లో 4.8 శాతం నమోదైంది.

ALSO READ: లేబర్ కార్డు అంటే ఏమిటి..? దీంతో ఎన్ని లాభాలో మీకు తెలుసా..?

సిటీలో సగటు కార్యాలయ అద్దెలు వార్షికంగా పరిశీలిస్తే దాదాపు 11.6 శాతం పెరిగింది. చదరపు అడుగుకు రూ. 92.2 కు చేరింది. ఇప్పటివరకు నమోదైన వాటిలో అత్యధికం. రంగాల వారీగా పరిశీలిస్తే.. లీజింగ్ కార్యకలాపాలలో 36 శాతం వాటాతో ఐటీ-బీపీఎం అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ ఆపరేటర్లు-30 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐ-23 శాతంతో నిలిచాయి. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు-GCC లు 0.83 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ లీజింగ్‌. హైదరాబాద్ మొత్తం లీజింగ్ పరిమాణంలో 26 శాతాన్ని దక్కించుకున్నాయి. GCC కేంద్రంగా హైదరాబాద్ కేరాఫ్‌గా మారబోతోంది.

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×