BigTV English

Hyundai Grand i10 Nios: రికార్డ్ క్రియేట్ చేసిన గ్రాండ్ ఐ10 నియోస్.. 4 లక్షల ఇళ్లకు చేరుకుంది!

Hyundai Grand i10 Nios: రికార్డ్ క్రియేట్ చేసిన గ్రాండ్ ఐ10 నియోస్.. 4 లక్షల ఇళ్లకు చేరుకుంది!

Hyundai Grand i10 Nios: దేశంలో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కార్లకు ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ విభాగంలో మారుతి సుజుకి స్విఫ్ట్, వ్యాగన్ఆర్, బాలెనో, ఆల్టో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, టాటా ఆల్ట్రోజ్ వంటి కార్లు బాగా ఫేమస్ అయ్యాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ దాని ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ గ్రాండ్ ఐ10 నియోస్ భారత మార్కెట్లో 4 లక్షల యూనిట్ల అమ్మకాలను క్రాస్ చేసింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మొదటిసారిగా గ్రాండ్ ఐ10కి ప్రత్యామ్నాయంగా 2019లో ప్రవేశపెట్టబడింది.  హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొంతకాలంగా కంపెనీ అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉందది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.


గ్రాండ్ i10 పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 83bhp పవర్, 113.8Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేయగలదు. ఈ కారు 5 స్పీడ్ ఆటోమేటిక్ , ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది కాకుండా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌లో CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది.

Also Read: Hyundai Grand i10 Nios Hy-CNG Duo: దుమ్ము దులిపేసిన హ్యుందాయ్.. సీఎన్‌జీ వెర్షన్‌లో మరో కొత్త కారు లాంచ్..!


CNG మోడ్‌లో ఇది గరిష్టంగా 69bhp పవర్‌ని, 95.2Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేయగలదు. CNG మోడల్‌లో వినియోగదారులు 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే చూస్తారు. ప్రస్తుతం హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 భారతీయ వినియోగదారుల కోసం 6 కలర్ ఆప్షన్స్‌లో 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌లో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, క్రూయిజ్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యుఎస్‌బి టైప్-సి ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్‌తో కూడిన 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కార్‌ప్లే కనెక్టివిటీ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ మరియు స్టార్ట్-స్టాప్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి.

Also Read: Citroen Basalt: సిట్రోయెన్ బసాల్ట్ కూపే ఎస్‌యూవీ లాంచ్.. మతిపోగొడుతున్న ఫీచర్లు!

ఇది కాకుండా భద్రత కోసం కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మార్కెట్లో మారుతి సుజుకి స్విఫ్ట్, రెనాల్ట్ ట్రైబర్‌లకు పోటీగా ఉంది. భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 5.92 లక్షల నుండి రూ. 8.56 లక్షల వరకు ఉంది.

Related News

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

Trump: ట్రంప్ నిర్ణయాలు.. కంప్యూటర్ల ధరలకు రెక్కలు, వాటితోపాటు

EPFO New Rule: పీఎఫ్ డబ్బులతో ఇల్లు కట్టాలి అనుకుంటున్నారా? ఈ గుడ్ న్యూస్ మీకే.. EPFO కొత్త మార్గదర్శకాలివే!

Jio Recharge Plans: మిస్ అయ్యానే.. జియోలో ఇన్ని ఆఫర్లు ఉన్నాయా!

iPhone 17 Air: వావ్ ఎంత స్మూత్‌గా ఉంది.. iPhone 17 Air సూపరబ్బా.

Bank Holidays: ఏంటీ ఆ మూడు రోజులు బ్యాంక్ పనిచేయవా.. ముందుగా ప్లాన్ చేసుకోండి ఇలా..

Big Stories

×