BigTV English

Best Budget Cars : మన మిడిల్ క్లాస్‌కి బెస్ట్ బడ్జెట్ కార్స్.. ఫీచర్లు తగ్గేదేలే!

Best Budget Cars : మన మిడిల్ క్లాస్‌కి బెస్ట్ బడ్జెట్ కార్స్.. ఫీచర్లు తగ్గేదేలే!
Best Budget Cars
Best Budget Cars

Best Budget Cars : కారు కొనాలని మనలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ కారు రేట్లు చూస్తే.. ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో కొందాం అనిపిస్తుంది. లైఫ్ ఎందుకు ఇలా ఏడ్చిందని బాధగా ఉంటుంది. బడ్జెట్‌లో ఏదైనా కారు కొందామన్నా కూడా చాలా కష్టంగానే ఉంటుంది. ఇదంతా ఒకప్పటి లెక్క. ప్రస్తుతం కాలంలో ట్రెండ్ మారింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా కార్లను కొంటున్నారు.


ఇది గమనించిన కొన్ని కంపెనీలు వీరిని టార్గెట్ చేశాయి.ఈ మిడిల్ క్లాస్ మైండ్‌సెట్‌కు అనుగుణంగా తక్కువ ధరకే మార్కెట్లోకి కార్లను తీసుకొస్తున్నాయి. అయితే ధర తగ్గువని ఫీచర్ల గురించి తక్కువ అంచనా వేయకండి. ఫీచర్స్ మాత్రం తగ్గేదేలే అంటున్నాయి. మారుతి నుంచి హోండా సిటీ కార్ల వరకు అతి తక్కువ బడ్జెట్‌ ఉండి బెస్ట్ ఫీచర్లు అందిస్తున్న కార్తు ఇవే. వాటి గురించి క్లారీటీగా తెలుసుకోండి.

Also Read : రోల్స్ రాయిస్ నుంచి ‘ఘోస్ట్ ప్రిజం’.. 120 మందికి మాత్రమే గురూ!


మారుతీ సుజుకీ.. ఈ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామీలీస్ కోసం ఈ కంపెనీ అనేక మోడల్ కార్లలో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రోడ్లపై కనిపించే చిన్నచిన్న కార్లన్ని ఎక్కువ శాతం ఈ కంపెనీకి చెందినవే ఉంటాయి. కార్ల ఉత్పత్తిలో కూడా మారుతీ సుజుకీ అగ్రగామిగా నిలుస్తుంది.
మారుతి సుజుకీ నుంచి రిలీజ్ అయిన బ్రెజ్జా సబ్ కాంపాక్టు ఎస్ యూవీ వినియోగదారులను ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్‌తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌ కలిగి ఉంటుంది. ఇది రూ.8.34 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్‌లో లభిస్తుంది.

మారుతీ సుజుకీకి చెందిన మరోకారు టొయోటా గ్లాంజా. ఇటీల ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న కారుల్లో ఒకటి.ఇది పెట్రోల్‌తో పాటు సీఎన్ జీ వేరయింట్‌లో అందుబాటులో ఉంది. ఇందులో 1.2 లీటర్ Lk Series ఇంజిన్‌పై ఆధారపడి పనిచేస్తుంది. కొత్త ఫీచర్లతో ఆకట్టుకునే ఈ కారు రూ.6.86 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్‌లో ఉంది.

అంతేకాకుండా దక్షిణ కొరియా చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ నుంచి కూడా మిడిల్ క్లాస్ బడ్జెట్ కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వెన్యూ సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ కారు వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇందులో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌ ఉంటుంది. ఇది మంచి డ్రైవింగ్ ఫీల్‌ను ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.10.70 లక్షలుగా ఉంది.

Also Read : లెక్సస్ నుంచి లగ్జరీ కార్.. మామా లోపల చూస్తే ఉంటది!

ఈ మధ్య కాలంలో ఎక్కువగా సేల్ అవుతున్న కార్లలో హోండా సిటీ ఉంది. ఈ కంపెనీ నుంచి మార్కెట్‌లోకి వచ్చిన కారు ఐవీ టెక్ ఇంజిన్‌పై నడుస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీకి ఇంజిన్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర రూ.11.74 లక్షలుగా ఉంది.

హోండా కంపెనీకి చెందిన మరో బడ్జెట్ కారు ఎలివేట్. ఈ కారు 2023లో మార్కెట్లోకి వచ్చింది. లేటేస్ట్ ఫీచర్లతో ఆకట్టుకునే ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ ఇంజిన్‌పై ఆధారపడి నడుస్తుంది. రూ.11.57 లక్షల ప్రారంభ ధరతో ఈ కారు లభిస్తుంది.

Related News

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Big Stories

×