Big Stories

Hyundai Motors : హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్

Hyundai Motors Hyundai Motors
Hyundai Motors

Hyundai Motors : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో పాపులర్ కంపెనీల్లో హ్యుందాయ్ కూడా ఒకటి. సౌత్ కొరియాకి చెందిన ఈ సంస్థ తమ కస్టమర్ల సేఫ్టీ విషయంలో ముందుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. వేసవిలో తమ కస్టమర్ల కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ శిబిరం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు పొందొచ్చు అనేది తెలుసుకుందాం.

- Advertisement -

ఈ ఏడాది వేసవి కాస్త ముందుగానే ప్రారంభమైంది. భానుడి దాటికి బయటకు వెళ్లాలంటే బయడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక బస్సులు, రైళ్లలో ప్రయాణించాలంటే ఉక్కపోతాగా ఉంటుంది. లాంగ్ జర్నీలు చేయాలంటే ప్రజలు వణిరిపోతున్నారు. ఇక కార్ల విషయారికి వస్తే.. ఏసీ లేనిదే ప్రయాణించడం సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -

Also Read : పల్సర్ NS 125 అప్‌డేట్ వెర్షన్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

అయితే మండుతున్న ఎండలకి కారుల్లో ప్రయాణించే క్రమంలో కొన్ని సందర్భాల్లో ఏసీలో సమస్యలు తలెత్తుతుంటాయి. ఏసీ లేకుంటే కారులో ప్రయాణం చాలా కష్టం. ఇంకా లాంగ్ జర్నీల వల్ల కారు ఇంజిన్‌ త్వరగా హీట్ అవుతాయి. అందువల్ల తరచూ మెకానిక్ షెడ్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో హ్యుందాయ్ తమ కస్టమర్ల కోసం వేసవి శిబిరాన్ని ప్రారంభించింది. ఈ శిబిరం ద్వారా 12 రోజుల పాటు తమ కస్టమర్లకు ప్రత్యేకమైన సేవలు అందించనుంది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 7 వరకు ఈ శిబిరం అందుబాటులో అందుబాటులో ఉంటుంది.

ఈ శిబిరం ద్వారా హ్యుందాయ్ కస్టమర్లు పలు సర్వీసెస్‌పై ప్రయోజనాలు పొందవచ్చు. హ్యుందాయ్ కస్టమర్లు ఉచితంగా కారు ఏసీ చెకప్ చేసుకోవచ్చు. వీల్ అలైన్‌మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ తదితర సర్వీసులపై 15 శాతం వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఇంకా ఈ శిబిరంపై ఎటువంటి అనుమానాలు ఉన్నా హ్యుందాయ్ సర్వీస్ సెంటర్లను సంప్రదించవచ్చు. లేదా డీలర్‌షిప్‌లో ఎంక్వేరీ చేయవచ్చు. కంపెనీ అందించే ఈ వేసవి క్యాంప్ ద్వారా కస్టమర్లు చాలా వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు.

Also Read : కియా సెల్టోస్ కొత్త ఆటోమేటిక్ వేరియంట్‌ లాంచ్!

ఇండియా మార్కెట్‌లో హ్యుందాయ్ మోటార్స్‌ నుంచి ప్రస్తుతానికి ఆరా, ఐ20, ఐ20 ఎన్ లైన్, గ్రాండ్ ఐ10 నియోస్, , ఎక్స్‌టర్, వెన్యూ, వెన్యూ ఎన్ లైన్, క్రెటా, క్రెటా ఎన్ లైన్, వెర్నా, అల్కాజర్, కోనా ఎలక్ట్రిక్, టక్సన్, ఐయోనిక్ 5 వంటి 14 మోడళ్లు ఉన్నాయి

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News