Big Stories

Kia Seltos : కియా సెల్టోస్ కొత్త ఆటోమేటిక్ వేరియంట్‌ లాంచ్!

Kia Seltos
Kia Seltos

Kia Seltos : దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో కియా సెల్టోస్ ఒకటి. ఈ కారు ఆగస్టు 2019లో లాంచ్ అయింది. సెల్టోస్ గతేదాడి మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్‌ను పొందింది. అయితే కంపెనీ దానిని అప్‌డేట్ చేస్తూనే ఉంది. కియా ఇప్పుడు సెల్టోస్ లైనప్‌కి రెండు కొత్త ఆటోమేటిక్ వేరియంట్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్దమైంది.

- Advertisement -

ఇందులో HTK+ మోడల్ ఒకటి. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్‌తో కూడిన CVT ఆటోమేటిక్ వేరియంట్ఒకటి. దీనిధర రూ. 15.40 లక్షలు.ఈ కొత్త వేరియంట్ మొదటి ఆటోమేటిక్ వేరియంట్ కంటే రూ. 1.20 లక్షలు తక్కువకు లభిస్తుంది. రెండవ కొత్త వేరియంట్ సెల్టోస్ HTK+ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ వేరియంట్ ధర రూ. 16.90 లక్షలు. ఇది సెల్టోస్‌లో అత్యంత చౌకైనా డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌. ఇది
డీజిల్ ఆటోమేటిక్ సెల్టోస్ HTX వేరియంట్ కంటే ధర రూ.1.30 లక్షలు ఎక్కువ.

- Advertisement -

Also Read : సముద్రపు నీటితో నడిచే కారు.. ఎలానో చూడండి!

సెల్టోస్‌లో ఇంజన్ స్టార్ట్-స్టాప్ బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డీఆర్‌ఎల్‌తో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ డీఫాగర్, రియర్ వైపర్ మరియు వాషర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్ వంటి హైలెట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఈ కియా సెల్టోస్ ఆటోమెటిక్ వేరియంట్లలో 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 114బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 114bhp పవర్‌ను రిలీజ్ చేస్తుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు పెట్రోల్ మరియు డీజిల్ ఆధారిత సెల్టోస్ కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ కలిగి ఉంటాయి.

Also Read : కొత్త డిజైన్, ఫీచర్లతో మారుతి స్విఫ్ట్, డిజైర్.. ధర కూడా తక్కువే!

ఇటీవల కియా ఇండియా తన కార్ల ధరలను 3 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ ధరల పెంపు ఏప్రిల్ 1, 2024 నుండి అమలులోకి రానుంది. కంపెనీ ధరలను పెంచడం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News