Big Stories

Hardik Pandya: నేను కెప్టెన్సీ చెయ్యలేను బాబోయ్: పాండ్యా

Hardik Pandya On Captaincy in IPL 2024Hardik Pandya On Captaincy in IPL 2024: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ అంటే అంత ఆషామాషీ కాదు. ఎందుకంటే ఆ ప్రాంఛైజీ ముఖేష్ అంబానీది. వాళ్లకి డబ్బులు అక్కర్లేదు. ప్రెస్టేజ్ కావాలి. అందుకనే ఎంత ఖర్చయినా పర్వాలేదు.. కప్ కొట్టాలని అంటారు. అలాగే గుజరాత్ టైటాన్స్ కి ఒకసారి ట్రోఫీని తీసుకొచ్చి, రెండోసారి రన్నరప్ గా నిలిపిన హార్దిక్ పాండ్యాపై ఇంట్రస్ట్ చూపించారు. తను అడిగినట్టు కెప్టెన్సీ కూడా ఇచ్చారు.

- Advertisement -

కానీ కొత్త సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ముంబై ఓటమి పాలైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ తీసుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ వచ్చీరాగానే ఉతుకుడు మొదలెట్టింది. దీంతో హార్దిక్ పాండ్యా బాగా టెన్షన్ పడ్డాడు. కెప్టెన్సీ చేయలేక మధ్యలో తన బాధ్యతలను మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు అప్పగించాడు.

- Advertisement -

దీంతో రోహిత్ శర్మ జట్టుని ముందుకు నడిపించాడు. బౌలింగ్ మార్పులతో పాటు ఫీల్డ్ సెట్ చేశాడు. ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాను బౌండరీ లైన్ వద్దకు పరుగెత్తించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వదిలేసి రోహిత్ శర్మకు అప్పజెప్పడం ఉత్తమమని నెటిజన్లు సూచిస్తున్నారు.

Also Read: ఉప్పల్‌లో పరుగుల పండుగ.. రికార్డు ఛేజ్‌లో చతికిలపడ్డ ముంబై..

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగుల భారీ స్కోర్ చేసింది.

లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ కూడా బాగా పోరాడింది. 5 వికెట్ల నష్టానికి 246 పరుగుల భారీ స్కోరు సాధించింది. కాకపోతే టార్గెట్ ఎక్కువగా ఉండటంతో 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. వచ్చే మ్యాచ్ ల నుంచి రోహిత్ కి కెప్టెన్సీ ఇవ్వడం ముంబై జట్టుకి మంచిదని పలువురు నెట్టింట సూచిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News