AP Cabinet Decisions: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇకపై స్థానిక సంస్థల ఎన్నికలు, సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నవారికి ముగ్గురు పిల్లలుంటే అనర్హత నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఈ మేరకు ఆమోదం తెలిపింది. తదుపరి నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు
- మావోయిస్టులపై మరో ఏడాదిపాటు నిషేధం పొడిగింపు
- పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన 217,144 జీఓలు రద్దు
- నూతన మెడికల్ కాలేజీల్లో 100 సీట్లతో MBBS కోర్సులు
- గుజరాత్ లోని పీపీపీ మోడల్ ను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశం
- కొత్త మద్యంపాలసీ రూపకల్పన
- రాష్ట్రంలోకి అక్రమ మద్యం రాకుండా చర్యలు
- జగన్ ఫొటో ఉన్న పాసుపుస్తకాలను వెనక్కి తీసుకుని రాజముద్ర ఉన్న పాసు పుస్తకాలు ఇవ్వడం
- త్వరలో రెవెన్యూ, గ్రామ సభల నిర్వహణ
- జిల్లాల్లో రెవెన్యూ అధికారులు తిరగాలని ఆదేశం
- సున్నిపెంటలో గత ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు చేస్తూ తీర్మానం
- సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరును తొలగించేందుకు కేబినెట్ ఆమోదం
Share