Tollywood Director Harish Shankar Fires On Trolls: టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తాను చేసే ఏ మూవీ అయినా సరే అందులో తన కామెడీ టైమింగ్, యాక్టింగ్ ఇలా ప్రతి మూవీలోనూ తనదైన శైలిలో ఆడియెన్స్‌ని మెప్పి్ంచి ఇమేజ్ బ్రాండ్‌ని తెచ్చుకుంటాడు హీరో రవితేజ. తాజాగా.. రవితేజ టైటిల్ రోల్‌లో యాక్ట్ చేస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్. ఈ మూవీకి డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే యాక్ట్ చేస్తోంది.
ఇక ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఇప్పటికే రవితేజ నటి భాగ్యశ్రీ బోర్సే కాంబోలో రిలీజైన సితార్ రెప్పల్ డప్పుల్ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని అమాంతం పెంచేశాయి. కానీ ఇక్కడ ఓ బిగ్ ట్విస్ట్ ఉంది. అదే వారిద్దరి మధ్య వ్యత్యాసం. హీరో హీరోయిన్ల ఏజ్ గ్యాప్‌పై నెటిజన్ల నుండి తీవ్రమైన ట్రోల్స్‌కి గురవుతున్నారు. అయితే లీడ్ పెయిర్ మధ్య ఏజ్ వ్యవధి ఎక్కువ కావడం. ఈ ట్రోల్స్‌పై ఆ మూవీ డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్ట్ అయ్యాడు. తమ ఏజ్ గ్యాప్‌పై వస్తున్న రూమర్స్ ఏంటో నాకస్సలు అర్థం కావడం లేదంటూ వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యాడు.
Also Read: వయనాడ్ విలయం.. భారీ విరాళం ప్రకటించిన ప్రభాస్..
ఓ ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నపుడు వాళ్లు చాలా విషయాలు గుర్తిస్తారు. కేవలం వయస్సు గ్యాప్ ఒక్కటే కాదు.. పెళ్లి కొడుకు సైడ్ ఫ్యామిలీ, తన జాతకంతో పాటు అన్ని విషయాలను ఆరా తీస్తారు. కానీ ఈ సినిమాల విషయానికొస్తే.. మేం చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే యాక్టర్ ఎప్పుడూ తన వయస్సును బట్టి యాక్ట్ చేయడు. సినిమాలో పాతికేళ్ల అమ్మాయిని కూడా యాబై ఏండ్ల వ్యక్తని నమ్మించాలి. ఇది ఒక యాక్టింగ్ నిజం కాదు. అయితే స్క్రీన్‌పై ఏజ్ అనేది కొంత పార్ట్ మాత్రమే. వయస్సు వ్యత్యాసంతో తమ నటనకి ఎలాంటి ఇష్యూ ఉండదు. అందుకే ఆమె మూవీకి సైన్ చేసింది. ఈ మ్యాటర్‌లో నటి ఫ్రీగా ఫీలయినప్పటికీ.. మరి ఎందుకో కొంతమంది పనిగట్టుకొని మరి హీరో హీరోయిన్ల వయస్సు డిఫరెన్స్ గురించి తెగ ఆలోచిస్తూ బాధపడుతుంటారని హరీష్ శంకర్ ప్రశ్నించాడు.
అలాగే టాలీవుడ్‌లో సీనియర్ ఎన్టీఆర్ నటి శ్రీదేవి చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. అంతేకాదు భారీ బ్లాక్ బస్టర్లను సైతం టాలీవుడ్ ఇండస్ట్రీకి కానుకగా ఇచ్చారు. మరోవైపు హీరో రవితేజ, శ్రీలీల జంటగా యాక్ట్ చేసిన మూవీ ధమాకా. ఒకవేళ ఈ మూవీ ఫెయిల్యూర్ అయితే టీం చిన్న వయస్సున్న అమ్మాయిని తీసుకోవడం వల్లే జరిగిందని ట్రోలర్స్ జరుగుతుండేవని డైరెక్టర్ మండిపడ్డారు. అంతేకాకుండా వారంతా ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నారంటూ ఎద్ధేవా చేశారు. కానీ ఆ మూవీ సూపర్ హిట్ అయింది. అది తప్పుడుగా రెండువిధాల వైఖరి అంటూ ఇలాంటి ద్వంద్వ వైఖరిగా వ్యవహరించడం నాకు అస్సలు ఇష్టం ఉండదంటూ ట్రోలింగ్ చేసే వారిపై హరీశ్‌శంకర్ తనదైన శైలిలో బదులిచ్చాడు.