BigTV English

Hy-CNG with Duo Technology: సరికొత్తగా హ్యుందాయ్.. డ్యూయల్ CNG కార్ లాంచ్.. రేంజ్ ఎంతంటే?

Hy-CNG with Duo Technology: సరికొత్తగా హ్యుందాయ్.. డ్యూయల్ CNG కార్ లాంచ్.. రేంజ్ ఎంతంటే?

Hy-CNG with Duo Technology: ఆటోమొబైల్ కంపెనీలు చిన్న డీజిల్ ఇంజన్ కార్ల తయారీకి గుడ్‌బై చెప్పాయి. దీంతో CNG టెక్నాలజీ నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో కొత్త సీఎన్‌జీ టెక్నాలజీతో దక్షిణ కొరియా సంస్థ హ్యుందాయ్ మోటర్స్ కొత్త కారును విడుదల చేసింది. కొత్త Exter HY-CNG Duoని దేశంలో రూ.8.50 లక్షల ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధరతో లాంచ్ అయింది. ఇది డ్యూయల్ సీఎన్‌జీ టెక్నాలజీతో వస్తుంది. అలానే దీనిలో బూట్ స్పేస్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. రన్నింగ్ ఖర్చులు తగ్గించడానికి ఈ టెక్నాలజీని తీసుకొచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఎక్స్‌టర్ Hy-CNG Duoతో పాటుగా Hy-CNG వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


హ్యుందాయ్ డ్యూయల్ సిఎన్‌జి సిలిండర్ టెక్నాలజీతో కూడిన మొదటి వాహనాన్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ టెక్నాలజీతో హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ను కంపెనీ విడుదల చేసింది. కంపెనీ ఈ టెక్నాలజీని Hy-CNG Duo పేరుతో విడుదల చేసింది. దీనిలో సింగిల్ సిలిండర్ కూడా లభిస్తుంది. ఇంతకుముందు కంపెనీ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

ఎక్స్‌టర్ హై-సిఎన్‌జి డుయో ఫీచర్ల విషయానికి వస్తే.. స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, 20.32 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టీపీఎంఎస్, ఈఎస్‌సీ, హెచ్‌ఏసీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.


Also Read: Upcoming Hybrid Cars: టాప్ లేచిపోద్ది.. యూత్ కోసం హైబ్రిడ్ కార్లు.. త్వరలోనే లాంచ్!

హ్యుందాయ్ ఎక్సెటర్ హై-సిఎన్‌జి డుయోలో కంపెనీ 1.2 లీటర్ బై-ఫ్యూయల్ ఇంజన్‌ను అందించింది. దీనితో 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. కంపెనీ ప్రకారం ఇది ఒక కిలో సిఎన్‌జితో 27.1 కిలోమీటర్ల (ఎక్స్‌టర్ సిఎన్‌జి మైలేజ్) వరకు నడపవచ్చు. SUV 1.2 లీటర్ ఇంజన్ నుండి 69 PS పవర్, 95.2 న్యూటన్ మీటర్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు

డబుల్ సిఎన్‌జి సిలిండర్ టెక్నాలజీతో ఎక్సెటర్‌ను గురించి హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సిఒఒ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. ‘మేము స్థిరమైన, వినూత్నమైన మొబిలిటీ సొల్యూషన్‌లను అందించడానికి కట్టుబడి ఉన్నాము. డ్యూయల్ సిలిండర్ సిఎన్‌జి టెక్నాలజీతో మా ఎంట్రీ SUV – ఎక్సెటర్‌ను ప్రారంభించేందుకు మేము సంతోషిస్తున్నాని అన్నారు’.

Also Read: Bajaj Freedom 125: బజాజ్ CNG కొనాలని చూస్తున్నారా? అయితే ముందుగా ఇవి తెలుసుకోండి!

హ్యుందాయ్ ఎక్స్‌టర్ హై-సిఎన్‌జి డ్యుయో ఎస్ వేరియంట్‌ను రూ. 8.50 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. దీని తరువాత SX వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.23 లక్షలుగా ఉంది. దాని టాప్ వేరియంట్ ఎక్స్‌టర్ నైట్ SXని CNGతో రూ. 9.38 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు.

Related News

Reko Diq Gold Mine: రెకోడిక్ బంగారు గని.. ఇక్కడ 5లక్షల కోట్ల విలువైన బంగారం.. ఇది బిగ్గెస్ట్ జాక్‌పాట్..!

Top 6 Clothing Brands: జుడియో తరహాలోనే వీటిలో కూడా దుస్తులు చాలా చీప్, వెంటనే ట్రై చెయ్యండి!

SBI Cards: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. సెప్టెంబర్ 1 నుంచి న్యూ రూల్స్

Zudio షోరూమ్‌కు ఎందుకంత క్రేజ్? ధరలు ఎందుకంత తక్కువ?

Gold Rate Today: కాస్త ఊరటగా బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే

CIBIL Score: లోన్ తీసుకునేవారికి తీపికబురు.. సిబిల్ స్కోర్ తప్పనిసరికాదు

Big Stories

×