BigTV English

Telangana Sheep Distribution Scam: గొర్రెల స్కాంలో కేటీఆర్ పీఏ..? అసలు నిజం ఏంటి..?

Telangana Sheep Distribution Scam: గొర్రెల స్కాంలో కేటీఆర్ పీఏ..? అసలు నిజం ఏంటి..?

– ఒకనాడు గ్రూప్ 1 లీకేజీలో సూత్రధారి?
– ఇప్పుడు గొర్రెల స్కాంలోనూ లింక్స్?
– మరోసారి తెరపైకి కేటీఆర్ పీఏ తిరుపతి బాగోతాలు
– నిందితుడు మాజీ ఓఎస్డీ కళ్యాణ్ డేటాలో పేరు?
– సిరిసిల్లలో కాంట్రాక్టర్ రాజుతో కలిసి దందాలు?
– తిరుపతి బాగోతాలన్నీ కేటీఆర్‌కు తెలిసిపోయాయా?
– గతంలో గ్రూప్ 1 ఇష్యూలో ఇబ్బందిపడ్డ కేటీఆర్
– ఇప్పుడు తిరుపతిని వెనకేసుకొస్తారా? హెచ్చరిస్తారా?
– స్కీం పేరిట స్కాం ఎంత జరిగిందో ఆరా తీస్తున్న ఏసీబీ
– గతంలో మంత్రుల పీఏల పాత్రపై ఆరా?
– ఏవ్వర్నీ వదిలేది లేదంటున్న ఇన్వెస్టిగేషన్ అధికారులు


KTR PA Tirupati Involved in Sheep Scam: బీఆర్ఎస్ హయాంలో జరిగిన స్కాములపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. వాటిలో ముఖ్యంగా గొర్రెల స్కాంపై ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి లింక్స్ బయటకు వచ్చినట్టు సమాచారం. 700 కోట్ల స్కాంలో తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ఎక్కడ దొరికితే అక్కడ దోచేశారు. మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్, సీఈఓ రాంచందర్ అరెస్ట్ తర్వాత కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందుకు కళ్యాణ్ కుమార్ డేటా లిస్టులో తిరుపతి పేరు ఉండటం కేటీఆర్ వర్గాన్ని కలవరపెడుతోంది. సిరిసిల్ల జిల్లాకు చెందిన రాజు అనే కాంట్రాక్టర్‌కి అప్పగించడంలో తిరుపతి పాత్ర చాలా ఉందని ఏసీబీ అధికారులు డేటా సేకరించారు. అయితే, డబ్బులు ఎంత చేతులు మారాయి. ఒక్క సిరిసిల్లలోనే వేలు పెట్టాడా తన సొంత జిల్లా అయిన జగిత్యాలలో కూడా స్కాంకు సహకరించాడా అనేది అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం కోటి రూపాయలకు పైగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఆ లబ్ధిదారుల వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబర్స్‌తో పాటు బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. జిల్లాల వారీగా లబ్ధిదారులకు అమ్మిన యజమానుల డేటాలో డబ్బులు ఎలా చేరాయి. మళ్లీ వీరి ఖాతాలోకి ఎలా వచ్చాయో పూర్తి వివరాలు ఉన్నట్లు సమాచారం. గొర్రెల కాంట్రాక్టర్ రాజు నుంచి ఇతనికి డబ్బులు చేరిన విషయాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది.

Also Read: Deputy CM Bhatti: ఆందోళన వద్దు.. అందరికి రుణమాఫీ


తిరుపతి ఆగడాలన్నీ కేటీఆర్‌కు తెలిసిపోయాయా..?

తిరుపతి బాగోతాలన్నీ కేటీఆర్‌కు తెలిసినట్టు సమాచారం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు తనకు తెలియకుండా ఇంకా ఏం చేశారోనని సైలెంట్‌గా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. గొర్రెల స్కాంలో డబ్బులు తినడంపై తనకు చెడ్డపేరు వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. గతంలో గ్రూప్ 1 లీకేజీ విషయంలో తిరుపతి తీరుపై అనుమానాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ల ప్రభుత్వమే ఉండటంతో కప్పిపుచ్చుకున్నారని, ఇప్పుడు ఒక్క కేసులో నిందితుడిగా మారితే తవ్వేకొద్దీ అక్రమాలు, అవినీతి బయటపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే, తిరుపతిపై వచ్చిన ఆరోపణలను అప్పట్లో కేటీఆర్ ఖండించారు. ఇప్పుడు గొర్రెల స్కాంలో అతని పేరు బయటకు రాగా, ఏం చేస్తారనేది ఆసక్తికర్తంగా మారింది.

తిరుపతి దందాలెన్నో..?

కేటీఆర్ పేరు చెబుతూ గతంలో ఓఎస్డీ మహేందర్ రెడ్డి అధికారులపై పెత్తనం చెలాయించారు. ఫైల్స్ క్లియరెన్స్‌కి ఓ లెక్క ఉండేదని చెబుతుంటారు. కంఫర్డ్ ఐఏఎస్ ఇంటర్వ్యూల ఫైల్‌లో కూడా ఇన్వాల్ అయి ఆయన పాత్ర ఏంటో నిరుపించుకున్నారు. ఇప్పుడు తిరుపతి కూడా స్కాముల్లో ఇరుక్కుంటాడని తెలుస్తుండటంతో కేటీఆర్ జాగ్రత్తలు తీసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

స్వేచ్ఛ – బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం

Related News

Yellandu Politics: ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పెత్తనంపై వ్యతిరేకత..

Congress: కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గ్యాప్ వచ్చిందా..?

Srikakulam Politics: దువ్వాడ కుల రాజకీయం

KCR: కేటీఆర్ కామెంట్స్.. బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటో?

BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్..

Bigg Boss AgniPariksha E3 Promo1: ఎమోషన్స్ తో చంపేస్తున్న సామాన్యులు.. వర్కౌట్ అవుతుందా?

Big Stories

×