Big Stories

Hyundai Hybrid Vehicle: హైబ్రిడ్ టెక్నాలజీపై హ్యుందాయ్ ఫోకస్.. 2026 నాటికి మొదటి వెహికల్!

Hyundai Planning to Launch Hybrid Vehicle on 2026 in India: హైబ్రిడ్ టెక్నాలజీ ఉన్న కార్లకు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం 2023-24లో దేశంలో హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థల్లో ఒకటైన దక్షిణ కొరియా కంపెనీ హ్యుందాయ్ త్వరలో హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో మారుతి, టయోటా కంపెనీలకు గట్టీపోటీ ఇవ్వనుంది. హ్యుందాయ్ హైబ్రిడ్ టెక్నాలజీ కార్లను ఎప్పుడు లాంచ్ కానున్నాయి? తదితర విషయాలు తెలుసుకోండి.

- Advertisement -

మీడియా నివేదికల ప్రకారం కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ యుయిసన్ చుంగ్ భారతీయ ఉద్యోగులతో మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు, హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన కార్లు కూడా పోర్ట్‌ఫోలియోలో ముఖ్యమైన భాగంగా ఉంటాయని చెప్పారు. ఈ టెక్నాలజీతో గత ఆర్థిక సంవత్సరం దేశవ్యాప్తంగా దాదాపు 85 నుంచి 90 వేల కార్లు అమ్ముడయ్యాయి. ఇది మొత్తం అమ్మకాలలో రెండు శాతం.

- Advertisement -

ప్రస్తుతం హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన వాహనాలను మారుతీ, టయోటా భారత మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ఈ ఏడాది కూడా హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన అనేక కార్లను తమ పోర్ట్‌ఫోలియోకు తీసుకురావడానికి రెండు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. సమాచారం ప్రకారం మారుతి సుజుకి 2031 నాటికి హైబ్రిడ్ టెక్నాలజీతో 7.5 లక్షల యూనిట్ల కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో హ్యుందాయ్ ఈ టెక్నాలజీతో కూడిన కార్లను తీసుకువస్తే నేరుగా మారుతికి, టయోటాకు పోటీ ఇస్తుంది.

Also Read: టీవీఎస్ రైడర్ 125 షాకింగ్ రివ్యూ.. కొనేముందు కచ్చితంగా చూడండి!

నివేదికల ప్రకారం హ్యుందాయ్ మోటార్ గ్రూప్ నుండి మొదటి హైబ్రిడ్ కారును 2026 నాటికి మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కంపెనీ హైబ్రిడ్ టెక్నాలజీపై ఎక్కువ దృష్టి పెడుతోంది.  హ్యుందాయ్‌తో పాటు, కియా కూడా హైబ్రిడ్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సమాచారం ప్రకారం 2026-27 నాటికి హైబ్రిడ్ టెక్నాలజీతో క్రెటా, అల్కాజార్, వెర్నా, టక్సన్ వంటి వాహనాలను భారతదేశానికి తీసుకురావచ్చు. దీనికి ముందు కంపెనీ 2025 నాటికి క్రెటాను ఎలక్ట్రిక్ SUVగా పరిచయం చేయవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News