Gold Rate Today: ద్యావుడా.. గత రెండు రోజులుగా రికార్డు స్థాయి పరుగుతో సామాన్యులకు చుక్కలు చూపించిన బంగారం ధరలు, నేడు కాస్త శాంతించాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన మార్పుల వల్ల ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైనప్పటికీ, కొనుగోలుదారులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగే సమయంలో వేలల్లో ఎగబాకుతూ, తగ్గేటప్పుడు మాత్రం కేవలం వందల్లోనే తగ్గడం పట్ల పసిడి ప్రియుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పెళ్లిళ్ల సీజన్, శుభకార్యాల నేపథ్యంలో ఈ స్వల్ప ఉపశమనం పెద్దగా ఊరటనివ్వడం లేదని, మార్కెట్ ఒడిదుడుకులు కొనుగోలుదారులను అయోమయంలో పడేస్తున్నాయని నగరాల్లోని ప్రధాన నగల వ్యాపారులు చెబుతున్నారు.
నేడు పసిడి ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,000 ఉండగా.. నేడు శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,730 వద్ద పలుకుతుంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,750 కాగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,500 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.270 తగ్గింది.
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,46,730 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,500 వద్ద కొనసాగుతుంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,730 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,500 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,730 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,500 వద్ద పలుకుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,880 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,34,650 వద్ద ఉంది.
నేటి సిల్వర్ ధరలు..
బంగారం ధరలు స్వల్పంగా తగ్గిన వెండి ధరలు మాత్రం నిశ్చలంగా ఉన్నాయి.
నేటి ధరలు చూసుకుంటే.. శనివారం కేజీ సిల్వర్ రూ. 2,60,000 వద్ద కొనసాగుతుంది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,50,000 వద్ద పలుకుతోంది.
Also Read: తెలంగాణ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. హోంశాఖలో భారీ ఉద్యోగాల జాతర!