BigTV English

Biryani-Dosa: దక్షిణాది రుచులు అదుర్స్.. ఉదయం దోశ, రాత్రికి బిర్యానీ

Biryani-Dosa: దక్షిణాది రుచులు అదుర్స్.. ఉదయం దోశ, రాత్రికి బిర్యానీ

Biryani-Dosa: సామాన్యులు మాంచి ఫుడ్‌కు ఎంతైనా ఖర్చు పెడతారు. ఏ మాత్రం వెనుకాడరు. టేస్టు బాగుండాలే గానీ, రేటు ఎంతకైనా కొనుగోలు చేస్తారు. తినేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించరు. ఇదే విషయాన్ని తేటతెల్లం చేసింది స్విగ్గీ సంస్థ. దేశంలో ఫుడ్ డెలివరీ చేసే సంస్థల్లో స్విగ్గీ, జొమాటోలు కీలకమైనవి.


ఏడాది పూర్తి అవుతున్న సందర్భంలో స్విగ్గీ ఓ రిపోర్టును బయటపెట్టింది. బిర్యానీని మోస్ ఫేవరేట్ ఫుడ్‌గా వర్ణించింది. ఎందుకంటే 2024లో స్విగ్గీ ద్వారా 83 మిలియన్లు ఆర్డర్లు చేశారు కస్టమర్లు. ఇక హైదరాబాదీలయితే నిమిషానికి 34 బిర్యానీలు ఆర్డర్ చేస్తున్నారు. దేశంలో ఇది అత్యధికం. దేశవ్యాప్తంగా అయితే సగటున నిమిషానికి 158 ఆర్డర్‌లన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే ఫుడ్ ఆర్డర్లలో బిర్యానీదే అగ్రస్థానం.

బిర్యానీని ఆరగించేవారు ఏ సమయంలో ఆర్డర్లు ఇస్తున్నారో తెలుసా? మధ్యాహ్నం, రాత్రివేళ కాదండోయ్. తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇస్తున్నట్లు తెలిపింది. అత్యధికంగా చికెన్ బిర్యానీని ఇష్టపడుతున్నట్లు తేలింది. ఒక వ్యక్తి ఏడాదిలో కనీసం 60 బిర్యానీలు కోసం ఆర్డర్లు ఇస్తున్నట్లు వెల్లడించింది. దాదాపు 18 వేల రూపాయల పైమాటేనన్నమాట. ఇది కేవలం ఆర్డర్ల ద్వారా వచ్చిన రిపోర్టు మాత్రమే. నేరుగా వెళ్లి ఆరగించే వారి సంఖ్యతో పోల్చితే ఎక్కువగా ఉంచవచ్చు.


టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఒక్క బిర్యానీ ఆర్డర్లు కేవలం ఎనిమిదిన్నర లక్షల పైమాటే. రంజాన్‌ పండగ సందర్భంగా 6 మిలియన్‌ బిర్యానీలు ఆర్డర్‌ చేశారు. ప్రియమైన భారతీయ వంటకంగా బిర్యానీ మారిపోయింది. రుచికరమైన సువాసన, క్వాలిటీ రైస్, సుగంధ ద్రవ్యాల ఆకర్షణకు తీసిపోదని నిరూపించింది.

ALSO READ: పండగ వేళ మహిళలకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

దేశంలో అల్పాహారం విషయాకొస్తే.. 23 మిలియన్ల ఆర్డర్‌లతో దోసా సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. ఏడాది పొడవునా ఆర్డర్ చేసినవాటిలో 23 మిలియన్లతో దోశ రెండో స్థానంలో నిలిచింది. దేశంలో హైదరాబాద్ తర్వాత బెంగళూరు వాసులు అతిగా ఇష్టపడేవాటిలో దోశ కూడా ఒకటి.

హైదరాబాద్‌లో 17 లక్షల దోసుల ఆర్డర్లు వచ్చాయి. ఎలా చూసినా సాంప్రదాయ దక్షిణ భారత వంటకాలపై తమ ప్రేమను ప్రదర్శించారు ఫుడ్ లవర్స్. అదే సమయంలో ఢిల్లీ, చండీగఢ్, కోల్‌కతా వాసులు స్థానిక రుచులపై తమ విధేయతను ప్రదర్శించారు. చోలే, ఆలూ పరాటా, కచోరీలు వరుసగా ఆర్డర్లు ఇచ్చినట్టు తేలింది.

ఇష్టమైన స్నాక్ విభాగానికొస్తే.. చికెన్ రోల్స్ 2.48 మిలియన్ ఆర్డర్‌లతో అగ్రస్థానంలో నిలిచింది. చికెన్ బర్గర్‌లు అర్థరాత్రి, తెల్లవారుజామున 2 గంటల మధ్య 1.84 మిలియన్ ఆర్డర్‌లతో అర్థరాత్రి ఇష్టమైన వంటగా నిలిచింది.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×