Fog in Delhi: దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరభారతంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. పలు రాష్ట్రాలను పొగ మంచు కప్పేసింది. ఢిల్లీలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదలయ్యాయి. దట్టంగా మంచు కురుస్తున్న నేపథ్యంలో విజుబులిటీ తగ్గిపోయింది. కొద్ది మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ కాస్త పెరిగినట్లు అధికారులు తెలిపారు. రెడ్ అలర్ట్ క్యాన్సిల్ చేసి ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
పొంగ మంచు కారణంగా 20 రైళ్లు ఆలస్యం
దట్టమైన పొగ మంచు ప్రభావం రైళ్ల రాకపోకల మీద తీవ్రంగా పడింది. దేశ రాజధానికి వచ్చి వెళ్లే పలు రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. ప్రస్తుతం 20 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. డిలే అయిన రైలు సర్వీసులలో గోవా ఎక్స్ ప్రెస్, పూర్వ ఎక్స్ ప్రెస్, కాళింది ఎక్స్ ప్రెస్, రేవా-ఆనంద్ విహార్ టెర్మినల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ సహా పలు రైళ్లు ఉన్నాయి. నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ తో సహా ఢిల్లీ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విజిబిలిటీ పడిపోవడంతో ప్రయాణికులు సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
విమాన రాకపోకలపై పొంగమంచు ఎఫెక్ట్
పొగమంచు ఎఫెక్ట్ పలు విమానాల రాకపోకల మీద పడింది. దేశ రాజధానికి వచ్చే, వెళ్లే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే పొగ మంచు ప్రభావానికి సంబంధించి ఢిల్లీ ఎయిర్ పోర్టు విమానయాన సంస్థలకు ప్రకటన జారీ చేసింది. క్యాట్-3 లేని విమాన సర్వీసులకు ఆటంకం కలగొచ్చని పేర్కొంది. ప్రయాణికులు విమానాల రాకపోకల గురించి ఆయా సంస్థలను సంప్రదించాలని సూచించింది.
ప్రయాణీకులను అలర్ట్ చేసిన ఇండిగో ఎయిర్ లైన్స్
అటు ఢిల్లీ ఎయిర్ పోర్టు పొగ మంచుకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తమ ప్రయాణీకులను ఇండిగో ఎయిర్ లైన్స్ అలర్ట్ చేసింది. పొగ మంచు కారణంగా తమ విమాన సర్వీసులకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఎప్పటికప్పుడు విమానాల రాకపోకలకు సంబంధించిన స్టేటస్ ను తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచించింది. విమానాలు ఆలస్యమైనా ప్రయాణీకులకు తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపింది.
Read Also: జస్ట్ 13 గంటల్లో ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు.. వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం ఎప్పుడంటే!
ఢిల్లీలో పెరిగిన ఎయిర్ క్వాలిటీ
అటు పొగ మంచు ఉన్నప్పటికీ ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) కొంత పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో పెరుగుదల కనిపించలేదని తెలిపారు. వారం ప్రారంభంలో కురిసిన కొద్దిపాటి వర్షాల కారణంగా స్వల్పంగా ఎయిర్ క్వాలిటీ పెరిగింది. పొగ మంచు కారణంగా మరికొంత పెరిగింది. బుధవారం ఉదయం AQI 333గా నమోదైనట్లు వాతావరణ అదికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోరెడ్ అలర్ట్ నుంచి ఎల్లో అలర్ట్ జారీ శారు.
హిమాచల్ ప్రదేశ్ లో రహదారుల మూసివేత
అటు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లోనూ పొగ మంచు తీవ్రంగా కురుస్తున్నది. జమ్మూ కశ్మీర్ లో హిమపాతం దట్టంగా కురుస్తోంది. మంచు ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో రహదారులను మూసివేశారు. దీంతో పర్యటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: మంచు కురుస్తోందని వెళ్తే.. జంక్షన్ జామ్, ఒకటి కాదు వేల వాహనాలు!