Manu Bhaker: దేశ క్రీడారంగ ప్రతిష్టాత్మక అవార్డు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న విజేతలను కేంద్రం త్వరలో ప్రకటించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పురస్కారానికి సిఫారసు చేసిన జాబితా నిన్న బయటకు వచ్చింది. దీంతో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న అవార్డుల నామినేషన్లలో రాజకీయ జోక్యం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది జరిగిన పారిస్ ఒలంపిక్స్ లో షూటింగ్ విభాగంలో రెండు కాంస్య పథకాలను సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టిన భారత స్టార్ట్ షూటర్ మనూ బాకర్ కు ఖేల్ రత్న నామినేషన్లలో చోటు దక్కకపోవడం పై తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.
Also Read: Boxing Day Test: బాక్సింగ్ డే పేరు ఎలా వచ్చింది? క్రికెట్ కు బాక్సింగ్ కు ఏం సంబంధం?
ఈ అంశంలో కేంద్రంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ పురస్కారానికి ఇంకా తుది ప్రతిపాదనల జాబితా సిద్ధం కాలేదని, అందులో మనూ భాకర్ పేరు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఆమె ఈ అవార్డు కోసం అసలు దరఖాస్తే చేసుకోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మనూ మాత్రం ఈ అవార్డు కోసం ఆన్లైన్ పోర్టల్ లో తన పేరును సమర్పించానని.. కానీ 30 పేర్లు గల షాట్ లిస్ట్ లో తన పేరు లేదని పేర్కొంది.
దేశ అత్యున్నత క్రీడా పురస్కారానికి తన పేరును పరిగణలోకి తీసుకోకపోవడంపై ఆమె తీవ్ర నిరాశకు గురైంది. అయితే ఈ వివాదంపై స్పందించిన మనూ భాకర్ తండ్రి రామ్ కిషన్ బాకర్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. తన కూతురిని క్రికెటర్ చేసుంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు మనూకి మరింత గుర్తింపు వచ్చేదని వ్యాఖ్యానించారు.
మనూ బాకర్ తండ్రి మాట్లాడుతూ.. “నా కూతురిని షూటర్ ని చేసినందుకు చింతిస్తున్నాను. షూటర్ కి బదులు ఆమెని క్రికెటర్ ని చేసి ఉండాల్సింది. అప్పుడు తనకి అన్ని అవార్డులు, ప్రశంసలు దక్కేవి. నా కూతురు ఒకే ఎడిషన్ లో రెండు ఒలంపిక్ పథకాలు గెలుచుకుంది. ఇంతవరకు ఎవరూ అలా చేయలేదు. తన కృషికి తగిన గుర్తింపు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. అవార్డుల కోసం అడుక్కోవాలా..? ఒక ప్రభుత్వ అధికారి నిర్ణయం తీసుకుంటే.. కమిటీ సభ్యులంతా సైలెంట్ గా ఉంటారా..?
Also Read: Ben Stokes Injury: ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ జట్టు నుంచి ఔట్
వారు తమ అభిప్రాయాలను బయటకు చెప్పరా..? అథ్లెట్లను ప్రోత్సహించే విధానం ఇదేనా..? మేము అవార్డు కోసం అప్లై చేసాము. తన పేరును ప్రభుత్వం పరిశీలిస్తుందని భావించాం. తీరా నామినీల లిస్టులో పేరు లేకపోవడంతో మనూ తీవ్ర ఆవేదనకు లోనైంది. తల్లిదండ్రులు క్రీడల్లో పిల్లలను ప్రోత్సహించాలా..? లేక ప్రభుత్వంలో ఐఆర్ఎస్ ఆఫీసర్లు అవ్వమని బలవంతం చేయాలా..? అసలు తను క్రీడాకారిణి కాకుండా ఉండాల్సింది. ఒలంపిక్స్ కి వెళ్లి దేశానికి పథకాలు సాధించి ఉండాల్సింది కాదు. గత రెండు మూడు సంవత్సరాలుగా మనూ పద్మశ్రీ, పద్మ విభూషణ్, ఖేల్ రత్న వంటి పురస్కారాల కోసం అప్లై చేసుకుంటూనే ఉంది. నావద్ద ఆధారాలు కూడా ఉన్నాయి. ఆమె దరఖాస్తు చేయకపోయినా.. ఆమె సాధించిన ఘనతలు చూసి కమిటీ ప్రతిపాదించాల్సింది” అని మనూ భాకర్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.